టాలీవుడ్‌లో నిర్మాతల కొడుకులు హీరోలుగా మారటం ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తోంది. ఇప్పటికే అలా చాలామంది హీరోలుగా మారి, సూపర్‌స్టార్లు కూడా అయ్యారు. ఇప్పుడు తాజాగా మరో నిర్మాత కుమారుడు టాలీవుడ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఆ టాలీవుడ్ నిర్మాత మరెవరో కాదు, డి.ఎస్. రావు. నానితో ‘పిల్ల జమీందార్’ సహా, తెలుగులో ఎన్నో సినిమాలకు ఆయన నిర్మాతగా వ్యవహరించారు. శ్రీనివాసరావు దమ్మాలపాటిని అందరూ డి.ఎస్. రావు అని పిలుస్తూ ఉంటారు. ఆయన కుమారుడు కృష్ణ దమ్మాలపాటి హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఇక,
Also Read : Prasanth Varma: నా మూవీ రిలీజ్ డేట్‌ను నేనే డిసైడ్ చేస్తా..
ఈ సినిమాతో చాలా కాలం గ్యాప్ తీసుకున్న దర్శకుడు సాయికిరణ్ అడవి రీఎంట్రీ ఇస్తున్నారు. ’16 రోజుల పండుగ’ పేరుతో ఈ సినిమా అన్నపూర్ణ స్టూడియోస్‌లో లాంచ్ అవుతోంది. ఇక, ఈ సినిమాలో హీరోయిన్‌గా ‘మ్యాడ్’ సినిమాలో హీరోయిన్‌గా నటించిన గోపిక ఉదయన్ నటిస్తోంది. మామూలుగా, పెళ్లికి సంబంధించిన వేడుకను ’16 రోజుల పండుగ’ అని వ్యవహరిస్తూ ఉంటారు. పెళ్లి తర్వాత 16 రోజులకు జరిపే వేడుకనే ఈ 16 రోజుల పండుగగా వ్యవహరిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో, ఈ సినిమా ఒక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నారు అని చెప్పొచ్చు. నిజానికి, టాలీవుడ్‌లో నిర్మాతల కుమారులు చాలామంది హీరోలుగా వచ్చి సూపర్ హిట్లు అందుకున్నారు. కొంతమంది తర్వాత కాలంలో దర్శకులుగా కూడా మారారు. మరి, డి.ఎస్. రావు కుమారుడు కృష్ణ దమ్మాలపాటి మొదటి సినిమాతో ఎంత మేరకు ప్రూవ్ చేసుకుంటాడనేది కాలమే నిర్ణయించాలి.