టాలీవుడ్‌లో సూపర్ హీరో జానర్‌కు కొత్త రూల్ తెచ్చిన ‘హను మాన్’ దర్శకుడు ప్రశాంత్ వర్మ. కంటెంట్, విజువల్స్, ప్రమోషన్ మూడు కోణాల్లోనూ ఆయన పని చేసిన తీరు అందరినీ ఆకట్టుకుంది. దీంతో ఆయనతో సినిమా చేయాలని పెద్ద హీరోల నుంచి, కొత్త ప్రొడక్షన్ హౌస్‌ల వరకు చాలామంది ఆసక్తి చూపుతున్నారు. అలాంటి సమయంలో తాజాగా గోవాలో జరిగిన IFFI ఈవెంట్‌లో ప్రశాంత్ వర్మ చెప్పిన మాటలు ఇప్పుడు సినీ వర్గాల్లో పెద్ద చర్చకు మారాయి.
Also Read : ‘Varaanasi’: ‘వారణాసి’లో చిన్న మహేశ్‌గా స్టార్ హీరో కొడుకు ఎంట్రీ..
ఈవెంట్‌లో మాట్లాడిన ప్రశాంత్ వర్మ.. ప్రస్తుత పరిస్థితుల్లో నిర్మాతలకే రిలీజ్ డేట్స్‌పై పూర్తి కంట్రోల్ లేకపోవడంతో, ఇక నుంచి తన సినిమాల రిలీజ్ డేట్‌ను తానే నిర్ణయించే షరతును ఒప్పందాల్లో పెట్టుకుంటానని ప్రశాంత్ వర్మ స్పష్టం చేశారు. ముఖ్యంగా VFX సినిమాలకు సమయం కీలకమైందని, కావాల్సిన సమయం ఇస్తేనే క్వాలిటీ ఔట్‌పుట్ వస్తుందని ఆయన చెప్పారు. ఎందుకంటే తన తొలి సినిమాల సమయంలో ఎదురైన సమస్యలు, చివరి నిమిషంలో వచ్చిన రిలీజ్ ఒత్తిళ్ల కారణంగా ఇప్పుడు ఈ నిర్ణయానికి వచ్చానని ఆయన వెల్లడించారు.
ప్రశాంత్ వర్మ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఉన్న లాజిక్‌ను సినీ విశ్లేషకులు సపోర్ట్ చేస్తున్నారు. దర్శకుడికి రిలీజ్ డేట్‌పై హక్కు ఇస్తే, ఆయనే తన విజన్‌ని 100% ప్రేక్షకులకు అందించే అవకాశం పెరుగుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా ఇది టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్‌కు శ్రీకారం కావొచ్చని భావిస్తున్నారు. దీంతో భవిష్యత్తులో దర్శకులు – నిర్మాతల మధ్య ఒప్పందాల్లో ‘రిలీజ్ డేట్ కంట్రోల్’ కూడా కీలక క్లాజ్‌గా మారే అవకాశం ఉందని చెప్పుకుంటున్నారు. ఇక ప్రశాంత్ వర్మ ఇప్పటికే ‘హను మాన్’ తరువాత వరుసగా పలు ప్రాజెక్టులు ప్లాన్ చేస్తుండగా, ఇప్పుడు ఆయన పెట్టిన ఈ కొత్త షరతు వచ్చే రోజుల్లో ఎలా స్పందన పొందుతుందో అన్నది ఇండస్ట్రీ మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తోంది.