టాలీవుడ్‌లో నిర్మాతల కొడుకులు హీరోలుగా మారటం ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తోంది. ఇప్పటికే అలా చాలామంది హీరోలుగా మారి, సూపర్‌స్టార్లు కూడా అయ్యారు. ఇప్పుడు తాజాగా మరో నిర్మాత కుమారుడు టాలీవుడ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఆ టాలీవుడ్ నిర్మాత మరెవరో కాదు, డి.ఎస్. రావు. నానితో ‘పిల్ల జమీందార్’ సహా, తెలుగులో ఎన్నో సినిమాలకు ఆయన నిర్మాతగా వ్యవహరించారు. శ్రీనివాసరావు దమ్మాలపాటిని అందరూ డి.ఎస్. రావు అని పిలుస్తూ ఉంటారు. ఆయన కుమారుడు కృష్ణ దమ్మాలపాటి…