Hyderabad: ఇంటి గేటు వద్ద కార్తీక దీపం.. చీరకు మంటలు అంటుకుని 18 ఏళ్ల యువతి మృతి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ (KPHB) పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇంటి గేటు వద్ద వెలిగించిన కార్తీక దీపం ప్రమాదవశాత్తూ చీరకు అంటుకోవడంతో 18 ఏళ్ల యువతి మృతి చెందింది. వివరాల్లోకి వెళితే.. కేపీహెచ్‌బీ అడ్డగుట్ట వెస్ట్రన్ హిల్స్‌లో నివాసముంటున్న సాయి వెంకట సింధు (18), రోడ్ నంబర్ 5లో ‘ఎస్ఎస్ బొటీక్’ నిర్వహిస్తోంది. రోజువారీ పనులు ముగించుకుని షాప్ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా, ఇంటి గేటు వద్ద వెలిగించి ఉంచిన కార్తీక దీపం ఆమె చీరకు అంటుకుంది. దీంతో క్షణాల్లోనే మంటలు ఒళ్లంతా వ్యాపించాయి. తీవ్రంగా గాయపడిన సింధును కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే, అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో సింధు ప్రాణాలు కోల్పోయింది. చేతికొచ్చిన యువతి ఇలా అకాల మరణం చెందడంతో అడ్డగుట్ట వెస్ట్రన్ హిల్స్ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇదిలా ఉండగా.. గత మూడు రోజుల కిందట మరో ఘటన చోటు చేసుకుంది. కార్తీక దీపం వెలిగిస్తుండగా ప్రమాదవశాత్తు చీరకు నిప్పంటుకుని ఓ వృద్ధురాలు మృతి చెందిన విషాద ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. చాపర్ల భానుమతి అనే వృద్ధురాలు ఎస్ఆర్ నగర్‌లోని జగన్నాథ రెసిడెన్సీలో ఉంటున్న తన కూతురు కిన్నెర వద్ద నివాసం ఉంటున్నారు. ఈ నెల 23న రెండో కార్తీక సోమవారం సందర్భంగా ఇంట్లో దీపం వెలిగిస్తుండగా ప్రమాదవశాత్తు ఆమె చీరకు నిప్పంటుకుంది. ఆ మంటలు కొన్ని క్షణాల్లోనే ఒళ్లంతా వ్యాపించాయి. దీంతో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన కుటుంబ సభ్యులు మంటలు ఆర్పేలోపే ఆమె శరీరం దాదాపు 50 శాతంపైగా కాలిపోయింది. వెంటనే ఆమెను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించగా.. అక్కడ రెండు రోజుల పాటు చికిత్స పొందిన అనంతరం బుధవారం ప్రాణాలు కోల్పోయారు.
Also Read
- Shah Rukh Khan-Kareena: పదిహేనేళ్ల తర్వాత షారుఖ్ - కరీనా కాంబో రిపీట్.. డ్యాన్స్ ఫ్లోర్‌ను దుమ్ములేపేసారుగా..!
- Natural Star Nani: యాక్షన్‌కు నాని గుడ్‌బై? మళ్లీ ఫ్యామిలీ కథల వైపు నేచురల్ స్టార్!
- 200cc ఇంజిన్, ఒక టన్ను సరుకు మోసే సామర్థ్యం.. TVS Armado కార్గో వాహనం లాంచ్..!
- December 2026 Movie Releases: డిసెంబర్లో సినిమా జాతర.. ఏకంగా 15 మూవీస్ రిలీజ్.. పూర్తి లిస్ట్ ఇదే..
తాజావార్తలు
-
O Torture Prema : హీరోగా మాదాల రంగారావు మనవడి ఎంట్రీ?
-
Hyderabad: ఇంటి గేటు వద్ద కార్తీక దీపం.. చీరకు మంటలు అంటుకుని 18 ఏళ్ల యువతి మృతి!
-
HIV AIDS: ఎయిడ్స్ మరణాలు పెరుగుతున్నాయా?
-
Shah Rukh Khan-Kareena: పదిహేనేళ్ల తర్వాత షారుఖ్ – కరీనా కాంబో రిపీట్.. డ్యాన్స్ ఫ్లోర్‌ను దుమ్ములేపేసారుగా..!
-
RBI New ATM Rules 2026: ATM నుంచి డబ్బులు తీసేవారికి RBI కొత్త రూల్స్.. యూజర్లు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు
ట్రెండింగ్
-
200cc ఇంజిన్, ఒక టన్ను సరుకు మోసే సామర్థ్యం.. TVS Armado కార్గో వాహనం లాంచ్..!
-
750cc ట్విన్ సిలిండర్ ఇంజిన్, 55 PS పవర్, 63 Nm టార్క్.. Royal Enfield Himalayan 750 లాంచ్..!
-
Tirumala Vaikunta Dwara Darshan Tickets: వెంకటేశ్వర స్వామి భక్తులకు గుడ్ న్యూస్.. వైకుంఠ ద్వార దర్శన టికెట్ల విడుదల అప్పుడే..!
-
165Hz డిస్ప్లే, HyperOS 4తో Redmi TV A55 2027.. ధర, ఫీచర్లు ఇవే!
-
IND vs NZ Test: ఐదు వికెట్లతో ఆకాష్ దీప్ అదుర్స్.. 356 పరుగులకు కివీస్ ఆలౌట్..!