ప్రముఖ కథానాయకుడు దుల్కర్ సల్మాన్ కి చెందిన వేఫేరర్ ఫిలిమ్స్ నిర్మాణ సంస్థ నిర్మించిన ‘కొత్త లోక చాఫ్టర్ట్ 1’. ఈ చిత్రానికి డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించాడు. సూపర్ హీరోయిన్ చంద్రగా కళ్యాణి ప్రియదర్శన్ నటించిన ఈ సినిమా కొత్త సినిమాటిక్ యూనివర్స్ యొక్క ప్రారంభాన్ని సూచిస్తుంది. భారతీయ సినిమాలో సూపర్ హీరో తరహా చిత్రాలు రావడమే తక్కువే. అలాంటిది భారతదేశపు మొట్టమొదటి మహిళా సూపర్ హీరో చిత్రంగా ‘కొత్త లోక చాఫ్టర్ 1’ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా టాక్ ఎలా ఉందంటే..
Also Read : Raja saab : రాజాసాబ్ రిలీజ్ డేట్ చెప్పేసిన నిర్మాత విశ్వప్రసాద్..
సూపర్ ఉమెన్ గా కళ్యాణి ప్రియదర్శిని అదరగొట్టింది. ఫస్ట్ హాఫ్ ను పాత్రలను పరిచయం చేస్తూ కథను చాలా బాగా ఎంగేజ్ చేస్తూ ఆడియెన్స్ ను కొత్త లోకంలోకి తీసుకెళ్ళేలా తెరకెక్కించాడు దర్శకుడు డొమినిక్. ఇక ఇంటర్వల్ బ్లాక్ సినిమాకే మేజర్ హైలెట్ గా అని చెప్పాలి. ఆడియెన్స్ కు గూస్ బమ్స్ తెప్పించాడు దర్శకుడు. కళ్యాణి ప్రియదర్శిని, నస్లీన్ పరామెన్స్ వేరే లెవల్ అనే చెప్పాలి. ఇక సెకండాఫ్ థ్రిల్ అయ్యే మూమెంట్స్ తో హై ఇచ్చే సీన్స్ తో అద్భుతమైన మేకింగ్ తో మలిచాడు డైరెక్టర్. ఈ సినిమాకు మేజర్ ప్లస్ అంటే జెక్స్ బిజోయ్ మ్యూజిక్. ప్రతి సీన్ ను పవర్ఫుల్ బీజీఎమ్ తో మరో స్తాయిఇకి తెసుకువెళ్ళాడు. ఓవరాల్ గా మిన్నల్ మురళి తర్వాత మాలీవుడ్ మరొక సాలిడ్ సూపర్ ఉమెన్ సినిమాను అందించి ఓనమ్ విన్నెర్ గా నిలిచింది. కేరళలో నేడు రిలీజ్ అయిన కొత్త లోక 29న తెలుగులో రిలీజ్ అవుతుంది.