నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తనకున్న ఆదరణను దెబ్బతీసేందుకు ప్రత్యర్థులు దుష్ప్రచారం చేస్తున్నారని అయినా. తాను వాటిని పట్టించుకోనని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.. నెల్లూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ నెల్లూరు జిల్లా.. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కొన్ని సర్వే సంస్థలు నిర్వహించిన సర్వేలో వైసీపీకి అనుకూలంగా వచ్చిందని, దీనిని తట్టుకోలేని కొందరు నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. వారు ఎన్ని విమర్శలు చేసినా నేను పట్టించుకోనని, వారిని దుర్భాషలాడటం కంటే మౌనంగా ఉండడం మంచిదని భావిస్తానన్నారు శ్రీధర్ రెడ్డి. అయినా కొందరు నీచాతినీచంగా నన్ను విమర్శిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read : Hamsa Nandini: హంస రీ ఎంట్రీ.. క్యాన్సర్ ను జయించి షూటింగ్స్ లో బిజీ బిజీ
రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారని, సోషల్ మీడియాలో కూడా ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. చివరకు నా భార్య..కూతుళ్ళ మీద కూడా దుష్ప్రచారం చేస్తున్నారని, దీని వెనకాల ఎవరున్నారో సమయం వచ్చినప్పుడు బయటకు పెడతానని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యర్థులు రెచ్చగొట్టే మాటలకు స్పందించవద్దని నేతలు కార్యకర్తలను కోరుతున్నానన్నారు. వారి వలలో పడవద్దని సూచిస్తున్నానని, వాళ్ల విచక్షణకు వదిలేద్దామన్నారు. ఎవరి మీద కక్ష సాధించకుండా ప్రజల కోసం పని చేద్దామని, ప్రజల అభిమానం నాకు ఉందని ఆయన వ్యాఖ్యానించారు. వారి ఆదరణ ఉన్నంతకాలం రాజకీయంగా ఎవరూ ఏమీ చేయలేరని ఆయన అన్నారు.