లౌక్యం సినిమాతో టాలీవుడ్‌ లో ఎంట్రీ ఇచ్చిన హంస నందిని, తొలి సినిమాతోనే మంచి గుర్తింపు పొందింది

జక్కన్న తెరకెక్కించిన ‘ఈగ’ సినిమాతో ఓ రేంజిలో పాపులారిటీ సంపాదించింది.

పవన్ కల్యాణ్ తో ‘అత్తారింటికి దారేది?’ చిత్రంలో అదిరిపోయే స్టెప్పులు వేసి ఆకట్టుకుంది.

వరుస సినిమాలతో బిజీగా ఉన్న హంస, గతేడాది ఓ షాకింగ్ న్యూస్ చెప్పింది.

తాను క్యాన్సర్ తో బాధ పడుతున్నట్లు వెల్లడించింది. సోషల్ మీడియా వేదికగా తనకు ప్రాణాంతక వ్యాధి సోకినట్లు చెప్పింది.

తన రొమ్ముకు చిన్న గడ్డలాంటిది కావడంతో హాస్పిటల్ కు వెళ్లి పరీక్షలు చేసుకున్నట్లు వివరించింది.

హంస గత ఏడాదిన్నరగా క్యాన్సర్ కు చికిత్స తీసుకుంది. వరుసగా కీమో థెరఫీ చేయించుకుంది. వైద్యుల సమక్షంలో చక్కటి ట్రీట్మెంట్ తీసుకుంది.

క్యాన్సర్ నుంచి హంస పూర్తిగా కోలుకుంది. ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంతో మళ్లీ సినిమాలపై ఫోకస్ పెట్టింది.

తన షూటింగ్ కు సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు, వీడియో నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

క్యాన్సర్ ను జయించిన హంసకు నెటిజన్లు శుభాకాంక్షలు చెప్తున్నారు. ఇకపై సినిమాల్లో బిజీ కావాలని కోరుకుంటున్నారు.