Kota Bommali PS : ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘కోట బొమ్మాళి పీఎస్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీనియర్ హీరో శ్రీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘కోట బొమ్మాళి పీఎస్’. ఈ సినిమా విడుదలకు ముందే ఈ సినిమా లోని లింగిడి అనే సాంగ్ సోషల్ మీడియా లో సెన్సెషన్ క్రియేట్ చేసింది. ఈ పాటకు ప్రతి ప్రేక్షకుడు స్టెప్పులేశారు. దీంతో ఈ సినిమాకు ప్రమోషన్స్ స్టార్ట్ చేయకుండానే ఫుల్‌గా పబ్లిసిటీ వచ్చేసింది. తేజా మార్ని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ మరియు వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలు పోషించారు. మలయాళీ సూపర్ హిట్ ‘నాయాట్టు’ రీమేక్ గా తెరకెక్కించిన ఈ సినిమాను జీఏ 2 సంస్థ నిర్మించింది. నవంబర్ 24 న విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా నిర్మాతలకు భారీ లాభాలను తీసుకువచ్చింది. థియేటర్లలో ప్రేక్షకులను మెప్పించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఈ న్యూఇయర్ వీకెండ్లో ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం జనవరి 5 న ఈ సినిమా స్ట్రీమింగ్ కానుందట. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ ప్రకటన రాలేదు. కానీ తర్వలోనే ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ అప్డేట్ ఇవ్వబోతున్నట్లు సమాచారం.ఈ చిత్ర కథ విషయానికి వస్తే ఒక రాజకీయ నాయకుడి కారణంగా ముగ్గురి పోలీసుల జీవితాలు తారుమారవుతాయి. ఆ తర్వాత ఓరోజు రాత్రి ఈ ముగ్గురు ప్రయాణిస్తున్న కారు యాక్టిడెంట్ కావడం..ఆ ప్రమాదంలో నియజకవర్గంలో ఎక్కువ ఓట్లు ఉన్న సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి మరణిస్తాడు. దీంతో ముగ్గురు పోలీసులను అరెస్ట్ చేయాలనే డిమాండ్ బాగా పెరుగుతుంది. దీంతో ఈ ముగ్గురి పోలీసుల జీవితాల్లో ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి.అనేది కోట బొమ్మాళి కథ.
Also Read
- Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్‌పై 1-0తో విజయం.!
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
- Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
- Veligonda Project: నేడే సీఎం చంద్రబాబు చేతులమీదుగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభం.!
తాజావార్తలు
-
Sardar 2: కార్తి ‘సర్దార్ 2’ ట్రైలర్ కు టైమ్ ఫిక్స్ చేసిన మేకర్స్!
-
CTET 2026: సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్.. దరఖాస్తుకు రేపే చివరి ఛాన్స్..
-
YASH : టాక్సిక్ డిజాస్టర్ తర్వాత రాకింగ్ స్టార్ యశ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి?
-
Gold Price Today: భారీగా తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో 10 గ్రాముల గోల్డ్ రేట్ ఎంతంటే?
-
Manisha Koirala: భారత్, చైనా అండగా ఉండాలి.. నేపాల్ వరదలపై కన్నీళ్లు పెట్టుకున్న మనీషా కొయిరాలా..
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!