Koratala Siva: శ్రీవారిని దర్శించుకున్న డైరెక్టర్ కొరటాల.. ఇది ఓ ఆనవాయితీ!
- సెప్టెంబర్ 27న దేవర విడుదల
- శ్రీవారిని దర్శించుకున్న కొరటాల
- బౌన్స్ బ్యాక్ అవ్వాలని కోరుకుంటున్న ఫాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామివారిని ఆయన దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వదించగా.. అధికారులు కొరటాలకు తీర్థప్రసాదాలు అందజేశారు. సెప్టెంబర్ 27న ‘దేవర’ చిత్రం విడుదలవుతున్న నేపథ్యంలో స్వామివారి ఆశీస్సులు పొందడానికి తిరుమలకు వచ్చారు. మెట్ల మార్గాన కొరటాల తిరుమల కొండకు చేరుకున్నారు.
శ్రీవారిని దర్శించుకున్న అనంతరం డైరెక్టర్ కొరటాల శివ మీడియాతో మాట్లాడారు. ‘నేను దర్శకత్వం వహించిన చిత్రం విడుదలకు ముందు స్వామివారి ఆశీస్సులు పొందడం ఆనవాయితీ. సెప్టెంబర్ 27న దేవర రిలీజ్ అవుతోంది. శ్రీవారి ఆశీస్సుల కోసం తిరుమలకు వచ్చాను.నా తదుపరి ప్రాజెక్ట్ వివరాలను దేవర విడుదల తర్వాత వెల్లడిస్తా’ అని కొరటాల చెప్పారు. ‘జనతా గ్యారేజ్’ బ్లాక్‌బస్టర్ తర్వాత ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్లో తెరకెక్కుతోన్న సినిమానే దేవర. ఈ మూవీపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. కొరటాల చివరి సినిమా ఆచార్య ఫ్లాఫ్ కావడంతో.. అయనకు మంచి జరగాలని, బౌన్స్ బ్యాక్ అవ్వాలని ఫాన్స్ కోరుకుంటున్నారు.
Also Read
- WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
- Pensions: పెన్షన్ల నిధులు విడుదల.. అక్టోబర్ 1వ తేదీ ఉదయం నుంచే పంపిణీ షురూ..
- New Train Service: ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైలు వచ్చేసింది.. వారానికి 3 రోజులు..
- Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
Also Read: Kanyaka Movie: ఓటీటీల్లో ‘కన్యక’ సినిమాకు సూపర్ రెస్పాన్స్.. నిర్మాతల ఆనందం!
దేవరలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నారు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ మూవీతో బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. దేవర సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకురానుంది. విడుదలకు ముందే ఈ చిత్రం అరుదైన ఘనతలు సొంతం చేసుకుంటోంది. రిలీజ్ అయ్యాక ఎన్ని రికార్డులు కొల్లగోడుతుందో చూడాలి.
#Koratala గారూ..మీకు మంచి జరగాలి..బౌన్స్ బ్యాక్ కావాలి pic.twitter.com/RuOQgX7vul
— devipriya (@sairaaj44) September 19, 2024
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!