Kanyaka Movie: ఓటీటీల్లో ‘కన్యక’ సినిమాకు సూపర్ రెస్పాన్స్.. నిర్మాతల ఆనందం!
- ఓటీటీలో కన్యక స్ట్రీమింగ్
- కన్యకకు మంచి రెస్పాన్స్
- అమ్మవారి మీద చిత్రీకరించిన పాట హైలట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మైథాలాజికల్ మూవీ ‘కన్యక’ సినిమా ప్రముఖ ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతూ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ఈ సినిమా ప్రస్తుతం ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్, హంగామా, టాటా ప్లే బింజ్, వాచో, వి మూవీస్ టీవీ లాంటి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. మంచి వ్యూస్‌తో కన్యక మూవీ దూసుకుపోతోంది. దాంతో చిత్ర నిర్మాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా చేసినందుకు ఆనందంగా ఉందని నిర్మాత కూరపాటి పూర్ణచంద్ర రావు అన్నారు.
కన్యక చిత్రాన్ని బిసినీఈటి సమర్పణలో శ్రీ కాశీ విశ్వనాథ్ పిక్చర్స్ బ్యానర్స్‌పై కేవీ అమరలింగేశ్వరరావు, ఆతుకూరి సాంబశివరావు, కూరపాటి పూర్ణచంద్ర రావు నిర్మించారు. ఈ చిత్రానికి రాఘవేంద్ర తిరువాయిపాటి దర్శకత్వం వహించారు. వినాయకచవితి సందర్భంగా ఈ చిత్రం విడుదల అయింది. విశ్వనాథ శాస్త్రి అనే ఒక బ్రాహ్మణోత్తముని కూతురు కన్యక కనిపించకుండా పోతుంది. ఆ అమ్మాయి లేచి పోయిందా లేదా ఎవరైనా చంపేశారా అని శ్రావ్య అనే అమ్మాయి ఆ ఊరికొచ్చి విశ్వనాథ శాస్త్రి గారి ఇంటిలో ఉంటూ ఇన్విస్టిగేట్ చేస్తుంది. కన్యకకు ఏమైంది, వచ్చిన అమ్మాయి ఎవరు?, చివరికి ఏం జరిగింది అని సస్పెన్స్ కథాంశంతో.. మనం చేసిన తప్పులను ఒక కన్ను గమనిస్తుందనే మెసేజ్‌తో ఈ సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది.
Also Read
- Royal Enfield Himalayan 440 Launched: 24.4 HP పవర్‌తో కొత్త అడ్వెంచర్ బైక్.. ధర, మైలేజ్, ఫీచర్లు ఏంటంటే..?
- Pakistan Hindu Temple Demolition Row: 100 ఏళ్ల నాటి హిందూ ఆలయం కూల్చివేత..! అసలు విషయంపై పాక్ వివరణ..
- Off The Record: తెలంగాణలో కేబినెట్ విస్తరణ ఎప్పుడు..? ఎవరికీ ఛాన్స్..?
- OTR: వివాదాలకు కేరాఫ్‌గా బోనబోయిన శ్రీనివాస్..
Also Read: Gold Rate Today: బంగారం ధరలకు మళ్లీ రెక్కలు.. తులంపై ఏకంగా 660 పెరిగింది! మరోసారి రికార్డు ధర
‘మా కన్యక సినిమాకు అన్ని ప్రముఖ ఓటీటీల్లో మంచి రెస్పాన్స్ వస్తోంది. మా మొదటి సినిమానే ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా చేసినందుకు ఆనందంగా ఉంది. నకరికల్లు వాసవి కన్యక గుడిలో అమ్మవారి మీద చిత్రీకరించిన పాట హైలట్‌గా నిలుస్తోంది. కన్యక సకుటుంబంగా చూడదగిన మంచి సినిమా’ అని నిర్మాతలు అన్నారు. దర్శకుడు రాఘవ మాట్లాడుతూ… ‘ఆడవారి పట్ల అమానుషంగా ప్రవర్తిస్తే ఎవరు క్షమించినా అమ్మవారు క్షమించదని, శిక్షిస్తుందని ఈ చిత్రం ద్వారా తెలియజేశాం. చాలా తక్కువ రోజుల్లో తక్కువ బడ్జెట్‌లో ఫినిష్ చేశాం. షూటింగ్‌కు నకరికల్లు, చాగంటివారి పాలెం వాసులు ఎంతో సహకరించారు. కన్యక సినిమాకు ఓటీటీలో మంచి రెస్పాన్స్ రావడం ఆనందంగా ఉంది’ అని అన్నారు.
తాజావార్తలు
-
Royal Enfield Himalayan 440 Launched: 24.4 HP పవర్‌తో కొత్త అడ్వెంచర్ బైక్.. ధర, మైలేజ్, ఫీచర్లు ఏంటంటే..?
-
Vaishnavi : “గూగుల్ లో నీ పేరు కొడితే ఏమొస్తుందని అవమానించారు”
-
Pakistan Hindu Temple Demolition Row: 100 ఏళ్ల నాటి హిందూ ఆలయం కూల్చివేత..! అసలు విషయంపై పాక్ వివరణ..
-
Rashmika : “ఆనందా.. ఐ లవ్ థిస్ బాయ్”.. ‘ఎపిక్’ వేదికపై దేవరకొండ బ్రదర్‌పై రష్మిక కామెంట్స్ వైరల్
-
Off The Record: తెలంగాణలో కేబినెట్ విస్తరణ ఎప్పుడు..? ఎవరికీ ఛాన్స్..?
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!