టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామివారిని ఆయన దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వదించగా.. అధికారులు కొరటాలకు తీర్థప్రసాదాలు అందజేశారు. సెప్టెంబర్ 27న ‘దేవర’ చిత్రం విడుదలవుతున్న నేపథ్యంలో స్వామివారి ఆశీస్సులు పొందడానికి తిరుమలకు వచ్చారు. మెట్ల మార్గాన కొరటాల తిరుమల కొండకు చేరుకున్నారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం డైరెక్టర్ కొరటాల శివ మీడియాతో మాట్లాడారు. ‘నేను దర్శకత్వం వహించిన…