పెద్దపల్లి జిల్లా సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో బీసీ కుల వృత్తులకు, చేతి వృత్తుల వారికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం చెక్కుల పంపిణీ చేసి జూనియర్ పంచాయతీ కార్యదర్శుల రెగ్యులరైజ్ పత్రాల పంపిణీ చేశారు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. సమాజంలో అన్ని వర్గాల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యమని ఆయన వెల్లడించారు. బీసీ కులవృత్తుల ఆర్థిక సహాయం నిరంతర ప్రక్రియ, చివరి లబ్దిదారుడి వరకు సాయం అందిస్తామని ఆయన పేర్కొన్నారు. 29 మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు రెగ్యులరైజేషన్ పత్రాలు అందజేసినట్లు ఆయన తెలిపారు. గృహలక్ష్మి కింద ప్రతి నియోజకవర్గానికి 3 వేల ఇండ్ల కేటాయించినట్లు ఆయన తెలిపారు.
Also Read : DK Shiva Kumar: అవినీతి ఆరోపణలు రుజువైతే రాజకీయాల నుంచి తప్పుకుంటా..
విదేశాలలో చదివే దళిత యువత కోసం అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్‌షిప్ పథకం అమలు చేస్తున్నారని, దళితులు అధికంగా నివసించే ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం, త్రాగునీటి సరఫరా, వంద యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా వంటి అనేక మౌలిక వసతులను ప్రభుత్వం కల్పిస్తుందని కొప్పుల ఈశ్వర్ తెలిపారు. గత ప్రభుత్వాలు స్వయం ఉపాధి కింద దళితులకు కేవలం 20 శాతం మాత్రమే సబ్సిడీ అందించేవని, సీఎం కేసీఆర్ దళితుల కోసం వంద శాతం సబ్సిడీ తో బ్యాంకు లింకేజీ లేకుండా 10 లక్షలు సహాయం అందించేందుకు దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారని కొప్పుల ఈశ్వర్ వెల్లడించారు.
Also Read : Tomato Rates: ఏపీలో భారీగా తగ్గిన టమాటా ధరలు.. కిలో ఎంతంటే..!