పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో జరగబోయే సింగరేణి మహా ధర్నా ఏర్పాట్లను మంత్రి కొప్పుల ఈశ్వర్ పరిశీలించారు. ఆయనతో పాటు.. TBGKS ప్రధాన కార్యదర్శి మిరియాల రాజిరెడ్డి, మేయర్ బంగి అనిల్ కుమార్, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం సింగరేణిపై సవతి ప్రేమ చూపిస్తుందని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా.. సింగరేణిని ప్రైవేటు పరం చేయడం సరైంది కాదని, రాష్ర్ట ప్రభుత్వం ఎన్ని సార్లు చెప్పినా కేంద్రం సింగరేణిపై తన వైఖరిని మార్చుకోడం లేదన్నారు. సింగరేణి పై ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేని మోడీ ఇక్కడి కార్మికులకు ఏం సమాధానం చెప్తాడని ఆయన ప్రశ్నించారు.
Also Read : Biryani for One Rupee: రూపాయికే బిర్యానీ.. ఎగబడ్డ జనం.. మన దగ్గరే..!
రేపు జరగబోయే సింగరేణి మహా ధర్నా కార్యక్రమాన్ని కార్మికులు విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సింగరేణి సంస్థను ఎందుకు ప్రైవేటు పరం చేస్తున్నారో కేంద్ర దగ్గర సమాధానం లేదని ఆయన అన్నారు. తెలంగాణలో 24గంటల కరెంటు ఉత్పత్తి అవుతుందని, దాన్ని అడ్డుకోవడానికి సింగరేణిని ప్రైవేటు పరం చేయాలని కేంద్ర వాడుకుంటుందని ఆయన ధ్వజమెత్తారు. సింగరేణి లాంటి అనేక సంస్థలను బీజేపీ ప్రైవేటు పరం చేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న తరాలకు సింగరేణిని చూపించాలంటే ఈ రోజు మనం కొట్లాడాలని ఆయన అన్నారు.
ఆంధ్రాలో స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటు పరం చేస్తే అక్కడ అడిగే నాథుడే లేకుండా పోయారని, కానీ తెలంగాణలో అలా చూస్తూ ఉండరు.. ఖబర్ధార్ మోడీ అని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read : Allu Arjun: చీరకట్టిన అల్లు అర్జున్.. నీ ధైర్యానికి జోహారయ్యా