Komuravelle: సిద్ధిపేట జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లిలో నేడు మల్లికార్జున స్వామి కళ్యాణం జరుగనుంది. కాశీ జగత్ గురు శ్రీ మల్లికార్జున విశ్వరాజ్య శివచార్య మహా స్వామి ఆధ్వర్యంలో 108 మంది వీర శైవ పండితులచే స్వామివారి కళ్యాణం జరుగనుంది. ఈ కళ్యాణోత్సోవానికి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరుకానున్నారు. ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు. ఈ ఉత్సవం కోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మూడు నెలల పాటు జరిగే బ్రహ్మోత్సవాలు మల్లన్న కళ్యాణంతో ప్రారంభం కానున్నాయి.
Red also: Astrology: డిసెంబర్ 29, ఆదివారం దినఫలాలు
మల్లన్న కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలిరానున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక నుంచి స్వామి వారి కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు భారీగా రానున్నారు. అందుకోసం.. పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు 50 వేల మందికి పైగా భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ సందర్భంగా ఏఆర్ అడిషనల్ డీసీపీ రామచంద్రరావు, హుస్నాబాద్ ఏసీపీ సతీష్, శ్రీ కొమురవెల్లి మల్లికార్జున స్వామి కల్యాణ మహోత్సవం బందోబస్తుతో కల్యాణ మహోత్సవం నిర్వహణకు వచ్చిన పోలీసు అధికారులు, సిబ్బందికి పటిష్ట బందోబస్తు, కల్యాణోత్సవం, పార్కింగ్, ఆలయ ప్రాంగణం, గర్భగుడిపై సూచనలు చేశారు. గర్భగుడి దర్శనం గురించి దిశానిర్దేశం చేశారు.
Red also: Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే.?
వేలాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించారు. పోలీస్ కంట్రోల్ రూం ఏర్పాటు చేయబడుతోంది, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కంట్రోల్ రూమ్‌లో ప్రతి డిపార్ట్మెంట్ నుండి ప్రజలు అందుబాటులో ఉంటారు. ఆలయాన్ని బీఐపీ దర్శనం, శీఘ్ర దర్శనం మరియు సాధారణ దర్శనం అనే మూడు విభాగాలుగా విభజించారు. కల్యాణ వేదిక వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పార్కింగ్ ప్రాంతాలు, ఆలయ ప్రాంగణాల్లో 75 సీసీ కెమెరాలతో పటిష్ట నిఘా ఏర్పాటు చేశారు. అదనపు డీసీపీలు 2, ఏసీపీలు 6, సీఐలు 25, ఎస్ఐలు 26, ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, మహిళా కానిస్టేబుళ్లు, మహిళా హోంగార్డులు, బీడీ టీమ్‌లు, యాక్సెస్ కంట్రోల్, రోప్‌పార్టీ, మొత్తం 361 మంది అధికారులు, సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయనున్నారు. .
Read Also: Swiggy sales: కండోమ్స్ సేల్స్‌లో బెంగళూరు టాప్