Jio Plans Change: భారతదేశంలో అతిపెద్ద టెలికాం ఆపరేటర్ అయిన రిలయన్స్ జియో తన రూ.19, రూ.29 ల డేటా వౌచర్ల వాలిడిటీలో పెద్ద మార్పులు చేసింది. ఇవి జియో వాడుకదారులు తమ ప్రస్తుత డేటా ముగిసినప్పుడు అత్యవసర రిచార్జ్ కోసం ఉపయోగించే వౌచర్లు. 2024 జూలై 3 నుండి జియో తన అన్ని ప్లాన్లను ధరలు పెంచింది. ఆ సమయంలో 15 రూపాయల డేటా వౌచర్ ధరను 19 రూపాయలకు పెంచింది. అలాగే 25 రూపాయల వౌచర్ ధరను 29 రూపాయలకు మార్చింది.
Also Read: Virat Kohli: ఆస్ట్రేలియా అభిమానులపై గుస్సాయించిన విరాట్ కోహ్లీ.. (వీడియో)
రిలయన్స్ జియో 19, 29 రూపాయల డేటా వౌచర్ల వాలిడిటీలో తాజాగా మార్పులు చేసింది. 19 రూపాయల వౌచర్ వాలిడిటీ ఇప్పటి వరకు యూజర్ ప్రాథమిక యాక్టివ్ ప్లాన్ వాలిడిటీ ప్రకారం ఉండేది. ఉదాహరణకు, యూజర్ ప్రాథమిక ప్లాన్ వాలిడిటీ 70 రోజులైతే, 19 రూపాయల డేటా వౌచర్ ను ఆ 70 రోజులు వాడుకోవచ్చు. అయితే, ఇప్పుడు ఈ వాలిడిటీను 1 రోజుకు మాత్రమే కుదించారు. అంటే, ఈ వౌచర్ ఇప్పుడు కేవలం ఒక రోజు మాత్రమే వాడకానికి ఉంటుంది. అలాగే, 29 రూపాయల డేటా వౌచర్ వాలిడిటీ కూడా మారింది. ఇదివరకు ఈ వౌచర్ యూజర్ ప్రాథమిక ప్లాన్ వాలిడిటీతో పాటు ఉండేది. కానీ ఇప్పుడు, ఈ వౌచర్ కేవలం 2 రోజులు మాత్రమే వాలిడ్ గా ఉంటుంది.
Also Read: IND Women vs WI Women: దీప్తి శర్మ ఆల్‌రౌండర్ షో.. వెస్టిండీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా
ఐకమరోవైపు, జియో తన 5G డేటాను వినియోగించే యూజర్ల కోసం మరొక ప్లాన్‌ను అందిస్తోంది. జియో ఇటీవల 601 రూపాయల ధరలో ఒక కొత్త మొబైల్ వౌచర్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్‌తో జియో యూజర్లకు ఒక సంవత్సరం పాటు అనలిమిటెడ్ 5G డేటా అందిస్తోంది. ఈ 5G వౌచర్‌ను వాడాలంటే, యూజర్‌కు ముందుగా ఒక జియో రిచార్జ్ ప్లాన్ ఉండాలి. ఇది రోజుకు కనీసం 1.5GB 4G డేటా అందించాలి.