Komatireddy Venkat Reddy : కేసీఆర్ దీక్ష చూసి తెలంగాణ ప్రకటన రాలేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేటీఆర్.. రాజకీయాల్లో అనుభవం లేని వ్యక్తి అంటూ విమర్శలు గుప్పించారు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రక్రియ మొదలుపెట్టినప్పుడు అమెరికాలో ఉన్నాడని, రెండో దశ ప్రక్రియ మొదలు కాగానే వచ్చాడు కేటీఆర్ అని ఆయన అన్నారు. తెలంగాణ కోసం మాతో పొత్తు పెట్టుకున్నాడని, వైఎస్ వద్దు అన్నా.. ఎదిరించి మాట్లాడామన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఇచ్చింది అంటే.. బ్రిటిష్ వాళ్ళు స్వాతంత్రం ఇచ్చినట్టు ఉందంటున్నాడని, కేటీఆర్ .. మీ తండ్రి మొదటి సభలో చెప్పిన మాటలు విను… కేసీఆర్ దీక్ష చూసి తెలంగాణ ప్రకటన రాలేదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. పిల్లలు చనిపోతున్నారు అని తెలంగాణ ప్రకటన చేశారు సోనియాగాంధీ అని, తెలంగాణ పేరుతో కేటీఆర్.. లక్షల కోట్లకు ఎదిగాడని ఆయన ఆరోపించారు.
Also Read : Genelia: మళ్లీ తల్లి కానున్న జెనీలియా అంటూ వార్తలు.. అసలు విషయం ఇదేనట!
Also Read
- Saudi-Houthis: మక్కా చేరిన హౌతీల దాడులు.. చప్పుడు చేయని పాక్.. కారణమిదేనా?
- Digital Payments: యూపీఐ ఛార్జీల నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకుంటుందా? ఫైనల్ ఆన్సర్ వచ్చేసింది!
- XI Jinping: జిన్‌పింగ్‌కు ఇస్కీమిక్ స్ట్రోక్.. బ్రిక్స్ నుంచి నేరుగా హాస్పిటల్‌కు.?
- UAPA: షహజాద్ భట్టి నెట్‌వర్క్‌పై భారత్ ఉక్కుపాదం.. ఉగ్రసంస్థగా ప్రకటన..
అంతేకాకుండా.. ‘సోనియా గాంధీని విమర్శించడం మానుకో. ఒకే ఇంట్లో ఇద్దరికి పెన్షన్ ఇచ్చాం. 20 ఏండ్ల క్రితం 400 అంటే దాని విలువ ఎంతో తెలుసుకో. ఆ రోజుల్లోనే 32 లక్షల ఇండ్లు కట్టించినం. మేము కట్టిన ఇల్లు..ఇప్పుడు 10 లక్షల విలువ. 30 వేల ఇండ్లు కట్టలేదు నువు నీ మోకానికి. కాళేశ్వరం డబ్బుల కోసం కట్టావు. పాలమూరు ప్రాజెక్టు లో ఒక్క మోటార్ కూడా పెట్టలేదు. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ మేము 70 శాతం పనులు పూర్తి చేసినం. 2 వేల కోట్లు ఇస్తే పనులు అన్ని పూర్త్జి అయ్యేవి.
Also Read : Rohit Sharma: అరుదైన ఘనత.. వన్డేల్లో 10 వేల పరుగులు చేసిన ‘హిట్’ మ్యాన్
కేటీఆర్..నీ వెంట ఉన్నది అంతా తెలంగాణ ద్రోహులే. దానం తెలంగాణ ఉద్యమకారులను కొట్టాడు. తలసాని.. సబితా.. మహేందర్ రెడ్డి లాంటి ద్రోహులు ఉన్నారు. . మల్లారెడ్డి..పాలు..పూలు తో పాటు భూములు కూడా అమ్ముకున్నాడు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడకండి. తెలంగాణ ద్రోహులు అంతా ని వెనకాల ఉన్నారు. కాంగ్రెస్ మీదా ఆరోపణలు చేస్తున్నావు మానుకో. పువ్వాడ అజయ్ కి… తెలంగాణ ఉద్యమం కి సంబంధం ఏముంది. సోనియాగాంధీ ని ఇంకో సారి అంటే పాపం తగులుతోంది కేటీఆర్. సోనియా గాంధీ తో గ్రూప్ ఫోటో ఎందుకు దిగావు. పనికి రాని మాటలు మాట్లాడకు. ఇంటర్ పేపర్ దిద్దడం రాదు. టీఎస్పీఎస్సీ పరీక్షలు పెట్టలేవు కానీ.. మాపై మాట్లాడుతున్నాడు’ అంటూ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ధ్వజమెత్తారు.
తాజావార్తలు
-
TGSRTC : బస్టాండ్ ఇక కేవలం బస్టాండ్ మాత్రమే కాదు.. మాల్‌ను తలపించేలా కొత్త లుక్
-
Saudi-Houthis: మక్కా చేరిన హౌతీల దాడులు.. చప్పుడు చేయని పాక్.. కారణమిదేనా?
-
Digital Payments: యూపీఐ ఛార్జీల నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకుంటుందా? ఫైనల్ ఆన్సర్ వచ్చేసింది!
-
XI Jinping: జిన్‌పింగ్‌కు ఇస్కీమిక్ స్ట్రోక్.. బ్రిక్స్ నుంచి నేరుగా హాస్పిటల్‌కు.?
-
Vijay-Trisha: త్రిష ప్లేస్‌లో నేనుంటేనా.. విజయ్ను వదిలేసి దూరంగా వెళ్లిపోయేదాన్ని: సీనియర్ హీరోయిన్
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!