లాగ్ బుక్ లు తీసుకొచ్చి 24 గంటల కరెంట్ ఇస్తున్నామని నిరూపించు… తెలంగాణ ప్రజల కోసం కరెంట్ తీగలను పట్టుకోవడానికి సిద్ధమన్నారు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఈమేరకు కేటీఆర్ కి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సవాల్ విసిరారు. ఆలేరు నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు కొమ్మిశెట్టి నర్సింలు, సింగిల్ విండో వైస్ చైర్మన్ వంగాల కృష్టయ్య, మాజీ సర్పంచ్ ఓంకార్ గౌడ్ తో పాటు బీఆర్ఎస్ నాయకులకు కండువా కప్పి కాంగ్రెస్ పార్టీ లోకి సాదరంగా ఆహ్వానించారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. సరైనా సమయం సరైనా నిర్ణయం తీసుకున్నారన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ లో చేరి మాకేంతో బలనిచ్చారని, గృహలక్ష్మీ పేరుతో రూ.3 లక్షలు ఇస్తానన్న కేసీఆర్ దాన్ని గాలికి వదిలేశారన్నారు. కేసీఆర్ ప్రకటించిన పథకాలన్ని ఆ పార్టీ కార్యకర్తలకు మాత్రమేనని, తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ చెప్పిన ఆరు గ్యారింటీలు చిన్న పథకాలే అయిన ప్రజలకు ఎంతో ఉపయోగపడతాయన్నారు కోమటిరెడ్డి వెంటక్ రెడ్డి అన్నారు.
60 రోజులు మీరు కష్టపడి కాంగ్రెస్ ను గెలిపించండని, ఆలేరు నియోజకవర్గానికి మొదటి ప్రాధాన్యం ఇస్తామన్నారు. ఆలేరు లో సాగునీటి ప్రాజెక్ట్ లను పూర్తి చేస్తామని, బీర్ల ఐలయ్య కు అందరు సహకరిస్తున్నారన్నారు. ఆలేరు కు ఎమ్మెల్యే కంటే నేను ఎక్కువసార్లు వచ్చానని, ఎమ్మెల్యే అంటే కార్లు వేసుకొని తిరగడం కాదన్నారు. పేదోడి కష్టం తీర్చాలి.. ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు వాస్తవం..కానీ ఇప్పటికీ బీఆర్ఎస్-బీజేపీ ఒకటే.. కేసీఆర్ బండారం మోడీ బయట పెట్టాడు. సబ్ స్టేషన్ లో లాగ్ బుక్ లు పెట్టండి. 24గంటల కరెంట్ ఇచ్చినట్లు రుజువైతే మేము కరెంట్ తీగలను పట్టుకుంటాం. తెలంగాణ కోసం మంత్రి పదవిని వదులుకున్న వ్యక్తిని నేను..
పార్టీలు మారితేనే పదవులు ఇస్తామని ప్రలోభాలకు గురిచేస్తున్నారు.. మరో రెండు రోజుల్లో కాంగ్రెస్ లో టికెట్ కన్ఫామ్ అవుతాయి.. యాదగిరి గుట్ట నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తాను.. అవసరం లేకున్న ఈ వాస్తు లేదని కొత్త సచివాలయం కట్టించారు కేసీఆర్… అన్ని వర్గాలకు సమానంగా కాంగ్రెస్ మేనిఫేస్టో ఉంటుంది… కాంగ్రెస్ డబ్బులతో పోటీ పడలేదు కానీ పథకాలతో పోటీ పడుతోంది.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పథకాలు అమలవుతాయి.. పథకాలు అమలు కాకపోతే.. నా పదవులకు రాజీనామా చేస్తాను.. బీఆర్ఎస్ ఇచ్చే డబ్బులకు ఆశపడకండి.. ప్రజలరా ఆలోచించి ఓటు వెయ్యండి..’ అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించారు.