Komatireddy : రేవంత్, ఠాక్రే తో ముగిసిన కోమటిరెడ్డి భేటీ.. ఏం చర్చించారంటే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Komatireddy : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏడాది తర్వాత ఆయన గాంధీభవన్‌లో అడుగుపెట్టారు. శుక్రవారం గాంధీభవన్‌లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మాణిక్‌రావు ఠాక్రేతో కూడా కోమటిరెడ్డి భేటీ అయ్యారు. వీరి భేటీ తర్వాత కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గాంధీభవన్ ఎదుట వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పార్టీలో అందరికీ గౌరవం దక్కాలి. అందరి సమష్టి నిర్ణయాలు ఉండాలి. ఇవన్నీ జరిగితే నేను మరింత ఉత్సాహంతో పనిచేస్తాను అని చెప్పాను. రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలని ప్రజల మనసులో ఉంది. హాత్ సే జోడో యాత్ర ఎలా చేయాలనే అంశంపై చర్చించామన్నారు.
Read Also: Komatireddy Venkat Reddy: నేనెప్పుడూ రానని చెప్పలేదే.. ఫోన్ చేస్తేనే వచ్చాను
Also Read
కేసీఆర్ ఏ సమయంలోనైనా ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందన్నారు. తెలంగాణలోని ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమ, విశ్వాసం వుందన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకునేందుకు రాహుల్ గాంధీని ప్రధాన మంత్రి చేసేందుకు కృషి చేయాలని కోమటిరెడ్డి పిలుపునిచ్చారు. అంతర్గత విషయాలను పక్కనబెట్టి.. 60 నుంచి 70 శాతం ఎమ్మెల్యే అభ్యర్ధులను ముందుగానే డిసైడ్ చేయాలని ఆయన కోరారు. ఎన్నికలు 15 రోజులు వుండగా టికెట్లు ఇవ్వడం సరికాదని.. ఈ విషయాన్ని రాహుల్ గాంధీ దృష్టికి ఎప్పుడో తీసుకెళ్లానని కోమటిరెడ్డి చెప్పుకొచ్చారు. పోటీ ఉన్న చోట నేతలను కూర్చోబెట్టి మాట్లాడాలని , ప్రభుత్వం వస్తే వాళ్లలో ఒకరికి ఎమ్మెల్సీ, నామినేటెడ్, ఛైర్మన్ పోస్టు ఇస్తామని హామీ ఇవ్వాలన్నారు.
Read Also: Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో విబేధాలు.. అలిగి వెళ్లిపోయిన వీహెచ్
రాష్ట్రంలోని సమస్యలపై కలెక్టరేట్ల వద్ద ఆందోళన నిర్వహించాలని కోమటిరెడ్డి అన్నారు. నేతలకు అన్ని రకాలుగా అండగా వుండి ప్రజా ఉద్యమాలు చేయాలని కోమటిరెడ్డి కోరారు. 9 ఏళ్ల నుంచి డీఎస్సీ లేదని ఆయన మండిపడ్డారు. గాంధీ భవన్‌కి రావడం తగ్గించి, నియోజకవర్గంలో ఎక్కువ సమయం వుండాలని వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. ఇన్‌ఛార్జ్ కూడా జిల్లాల వారీగా తిరగాలని చెప్పానని కోమటిరెడ్డి తెలిపారు. ఇప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్‌కు 40-50 సీట్లు వస్తాయి. నాకు, రేవంత్‌కు మధ్య ఎలాంటి విభేదాలు లేవు. కాంగ్రెస్ బలమైన పార్టీ. బీఆర్‌ఎస్ వైఫల్యాలపై పోరాడుతాము అని స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
WhatsApp: వాట్సాప్ లో కొత్త సెక్యూరిటీ ఫీచర్.. AI కూడా మీ చాట్ చదవలేదట! Restricted Chat ఎలా పనిచేస్తుందంటే?
-
Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి అన్ని శుభవార్తలే, డబ్బే డబ్బు!
-
Tecno Pop 20C: రూ.10 వేల బడ్జెట్లో Tecno కొత్త ఫోన్.. 5200mAh బ్యాటరీ, 13MP కెమెరా, Android 16
-
Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!