ఈ సీజన్ ఆరంభ మ్యాచ్ డిపెండింగ్ ఛాంపియన్ కోల్ కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు మధ్య మ్యాచ్ జరిగింది. పోటాపోటీగా తలపడిన ఈ మ్యాచ్ లో ఆర్సీబీ బోణి కొట్టింది. ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీలతో చెలరేగగా.. రజిత్ పాటిదార్ 34 పరుగులతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. భారీ అంచనాలతో బరిలోకి దిగిన కేకేఆర్ బ్యాటర్లు ఆర్సీబీని ఢీకొట్టలేకపోయారు. డికాక్ ఆరంభంలోనే వికెట్ కోల్పోయాడు. సునీల్ నరైన్ 44, కెప్టెన్ అజింక్య రహానే 56, అంగ్రీస్ రఘువంశీ 30 పరుగులతో ఫర్వాలేదనిపించారు.
Also Read:Jammu Kashmir: పాక్‌ని పట్టించుకునేదే లేదు.. రెండు ప్రాజెక్టుల పనుల వేగం పెంచండి..
ఈ మ్యాచ్ లో ఆర్సీబీ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇప్పుడు ఐపీఎల్ పునప్రారంభంలో ఈ రెండు జట్లు మరోసారి తలపడనున్నాయి. ఈ సీజన్లో ఆర్సీబీ 11 మ్యాచుల్లో 8 గెలిచి 16 పాయింట్లతో టేబుల్ లో రెండో స్థానంలో కొనసాగుతుంది. కేకేఆర్ 12 మ్యాచుల్లో 5 గెలిచి ఆరో స్థానానికి పరిమితమైంది. ప్లేఆఫ్స్ రేసులో ఆర్సీబీ ముందంజలో ఉంది. మరో మ్యాచ్ గెలిచి దర్జాగా ప్లేఆప్స్ కి చేరుతుంది. కేకేఆర్ ప్లేఆప్స్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. కాగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఇరు జట్లు మరోసారి పోటీ పడనున్నాయి.
Also Read:Smartphone Safety Tips : వేసవిలో మీ ఫోన్ బాగా వేడెక్కుతుందా? ఈ సింపుల్ టిప్స్ పాటించండి..
గత పదేళ్లలో ఆర్సీబీ చిన్నస్వామి స్టేడియంలో కేకేఆర్ ని ఓడించలేదు. ఈ మైదానంలో ఆర్సీబీ చివరిసారిగా అంటే 2015లో కేకేఆర్ ని ఓడించింది. దాంతర్వాత ఈ పదేళ్లలో ఆర్సీబీకి తమ సొంతమైదానంలో విజయం దక్కలేదు. చిన్నస్వామి స్టేడియంలో RCB, KKR మధ్య మొత్తం 12 మ్యాచ్‌లు జరిగాయి. అందులో KKR 8 మ్యాచ్‌ల్లో గెలిచింది. ఆర్సీబీ కేవలం 4 మ్యాచ్‌ల్లో మాత్రమే గెలిచింది. గత గణాంకాలను పరిశీలిస్తే చినస్వామిలో కేకేఆర్ పైచేయి సాధించింది. ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు 35 మ్యాచులు జరిగితే 20 మ్యాచ్‌ల్లో కేకేఆర్ గెలిచింది.
Also Read:Smartphone Safety Tips : వేసవిలో మీ ఫోన్ బాగా వేడెక్కుతుందా? ఈ సింపుల్ టిప్స్ పాటించండి..
బెంగళూరు జట్టు 15 మ్యాచ్‌ల్లో గెలిచింది. ఇక్కడ కూడా KKRదే పైచేయి. ఇప్పుడు ఆర్సీబీ తమ సొంతమైదానంలో గెలిచి పదేళ్ల నిరీక్షణకు తెరదించుతుందా లేదా చూడాలి. ఇరు జట్లలో భారీ హిట్టర్లున్నారు. ఆర్సీబీలో విదేశీ ప్లేయర్లు భీకరంగా పోరాడుతున్నారు. రోమారియో షెపర్డ్, ఫీల్ సాల్ట్, జోష్ హేజిల్ వుడ్, కోహ్లీ, రజిత్ పాటిదార్ లాంటి నమ్మకమైన ప్లేయర్లున్నారు. ఈ సీజన్లో వారంతా అద్భుతంగ రాణిస్తున్నారు. ఇలా మ్యాచ్ విన్నింగ్ స్క్వాడ్‌తో బరిలోకి దిగుతుండటంతో ఈసారి కప్పు మాదే అంటూ ఆర్సీబీ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Also Read:Pakistan: భారత్‌ని మరిచిపోండి, పాకిస్తాన్ ఈ రెండు రాష్ట్రాల GDPని కూడా దాటలేదు..
కేకేఆర్ లో అంతకంటే స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉంది. కానీ ఈ సీజన్ వారికేమాత్రం కలిసిరావట్లేదు. కెప్టెన్ రహానే ఒక్కడే నిలకడగా రాణిస్తున్నాడు. భారీ ఆశలు పెట్టుకున్న వెంకటేష్ అయ్యర్ తీవ్రంగా నిరాశపరుస్తున్నాడు. డికాక్ తన స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వలేకపొతున్నాడు. రింకు సింగ్, రస్సెల్ రాణించాల్సి ఉంది. ఏదేమైనా కేకేఆర్ కు ప్లేఆప్స్ అవకాశాలు చాలా తక్కువగా ఉండటంతో ఆర్సీబీతో జరగబోయే మ్యాచ్ లో ఓడినా పెద్దగా నష్టం ఉండకపోవచ్చని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. కానీ ఈ మ్యాచ్ లో ఆర్సీబీ తప్పక గెలవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.