Kodali Nani: వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని చంద్రబాబు, పవన్ కల్యాణ్ పై మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం కలెక్టర్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు పాపం పండిందని ఆరోపించారు. టెక్నికల్ నాలెడ్జ్ తో గతంలో 18 కేసుల్లో స్టే లు తెచ్చుకున్న వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు. మరోవైపు.. పవన్ కల్యాణ్ అసెంబ్లీలో అడుగుపెట్టి అధ్యక్ష అనాలంటే చంద్రబాబు సపోర్ట్ కావాలని తెలిపారు. చంద్రబాబు 18 సీట్లతో ప్రతిపక్ష హోదా దక్కించుకోవాలంటే పవన్ కల్యాణ్ సపోర్ట్ కావాలన్నారు. పవన్ కల్యాణ్ కు అసెంబ్లీకొచ్చి మైకు పట్టుకోవాలని ఆశ.. కానీ, ఒంటరిగా వస్తే మైకు కదా అసెంబ్లీ గేటు కూడా దాటడని కొడాలి నాని అన్నారు. చంద్రబాబుకు ప్రతిపక్షానికి 18 సీట్లు, పవన్ కళ్యాణ్ కి 1 సీటు మాత్రమే కావాలన్నారు.
Read Also: Nandyala: 18 రోజుల పసివాడిని గొంతు కొరికి హత్య చేసిన కన్నతల్లి
పవన్ కల్యాణ్ ఎమ్మెల్యే అవటానికి ఆయనను నమ్ముకున్న జనసేన కార్యకర్తలు తిట్టుకున్నా, కొట్టుకున్నా, చచ్చినా అక్కర్లదు. జనసేన పార్టీ సర్వనాశనం అయిపోయినా పర్వాలేదు. పవన్ ఎమ్మెల్యే అవటం కోసం, చంద్రబాబు ప్రతిపక్ష హోదా కోసం కలిసి పోటీ చేయనున్నారు అని కొడాలి నాని వివరించారు.
Read Also: Bengaluru : ట్రాఫిక్ సమస్య నుంచి బయటపడేందుకు ఓ మహిళ ఇచ్చిన ఐడియా వైరల్..