సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గ బీఆర్ఎస్ అసమ్మతి నేతలు కోదాడలో మరోసారి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. నియోజకవర్గ మాజీ ఇన్చార్జ్ కన్మంతరెడ్డి శశిధర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు లతోపాటు అసమ్మతి నేతలు… బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య వైఖరిని కొందరు నేతలు వ్యతిరేకిస్తూ…. బొల్లం మల్లయ్య కు మరోసారి టికెట్ ఇవ్వద్దని అధినేత కేసీఆర్‌పై చాలాకాలంగా ఒత్తిడి తీసుకొస్తున్నారు కానీ… అసమ్మతి నేతల విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకోనీ అధినేత కేసీఆర్ బొల్లం మల్లయ్య యాదవ్ కు మరోసారి పోటీ చేసే అవకాశం ఇచ్చారు.
Also Read : Ayalaan Movie:సంక్రాంతి 2024 రేస్ లోకి మరో మూవీ..థియేటర్లు దొరికేనా?
దీంతో అసంతృప్తులు, అసమ్మతి నేతలు అధినేతపై ఆగ్రహంగా ఉన్నారు. ఇప్పటికే పలుమార్లు సమావేశమైన అసమ్మతి నేతలు బొల్లం మల్లయ్య యాదవ్ ను మార్చాల్సిందేనని… ఆయనను మార్చకుంటే బొల్లం కు ఎన్నికల్లో సహకరించేది లేదని స్పష్టం చేశారు.. తాజాగా ఈరోజు మరోసారి అసంతృప్త, అసమ్మతి నేతలు సమావేశమై… అధినేత తమ విజ్ఞప్తిని పరిశీలించకపోతే ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగాలని నిర్ణయించారు… తమలో ఎవరికి టికెట్ ఇచ్చినా పర్వాలేదoటున్న నేతలు… తమకు టికెట్ ఇవ్వకపోతే ఎవరో ఒకరు బరిలోకి దిగడంతో పాటు దిగిన వ్యక్తికి అందరూ సహకరించాలని… పార్టీ బరిలోకి దింపిన బొల్లం మల్లయ్య కు సహకరించేది లేదని తీర్మానించారు.
Also Read : Chandrababu Case: చంద్రబాబుకు మరో బిగ్ షాక్.. రిమాండ్ పొడిగింపు