Delhi : ఢిల్లీలో కత్తితో దాడి ఘటన వెలుగు చూసింది. బుధవారం రాత్రి గోవింద్‌పురి ప్రాంతంలో నివసిస్తున్న ముగ్గురు సోదరులను గుర్తు తెలియని దుండగులు కత్తితో పొడిచి గాయపరిచారు. ఇందులో ఒక సోదరుడు అక్కడికక్కడే మరణించాడు. ఇద్దరిని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా.. అక్కడ వారు చికిత్స పొందుతున్నారు. ఈ కత్తితో దాడి ఘటనతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Read Also:Kajal Agarwal : బిగ్ బాస్ హౌస్ లో సందడి చేయనున్న చందమామ..?
పోలీసులకు అందిన సమాచారం ప్రకారం, బుధవారం రాత్రి 10:00 గంటల సమయంలో గోవింద్‌పురి ప్రాంతంలో ముగ్గురు సోదరులపై గుర్తు తెలియని దుండగులు కత్తితో దాడి చేశారు. ఇందులో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రికి తరలించేలోగా సోదరుల్లో ఒకరు మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. మృతుడిని ఆజాద్‌గా గుర్తించగా అతని మరో ఇద్దరు సోదరులు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దుండగులు ఎందుకు ఈ దాడికి పాల్పడ్డారనే దానిపై ఎలాంటి సమాచారం అందలేదు.ఈ ఘటన తర్వాత సీనియర్ పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని మొత్తం కేసును పరిశీలించారు. ప్రస్తుతం నిందితులను గుర్తించేందుకు పోలీసులు సమీపంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఘటన జరిగిన ప్రాంత ప్రజలను కూడా విచారిస్తున్నారు.
Read Also:KCR Warning: కామారెడ్డి బీఆర్ఎస్ నేతలకు కేసీఆర్ వార్నింగ్
తూర్పు ఢిల్లీలోని మధు విహార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నీలకంత్ అపార్ట్‌మెంట్‌లోని ఓ ఫ్లాట్‌లో గత బుధవారం ఓ మహిళా ఫోటోగ్రాఫర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం గమనార్హం. మహిళ మృతదేహం ఆమె ఫ్లాట్‌లోని బాత్‌రూమ్‌లో పడి ఉంది. పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. పోలీసులు విచారణ ప్రారంభించారు. ఆ మహిళను 32 ఏళ్ల మహిళా ఫోటోగ్రాఫర్‌గా గుర్తించినట్లు తూర్పు ఢిల్లీ డీసీపీ అమృత గుగులోత్ బుధవారం సాయంత్రం తెలిపారు.