టీమిండియా స్టార్ బ్యాటర్లు కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ ఆసియా కప్ లో ఆడేలా కనిపించడం లేదు. టీమిండియాకు ఈ వార్త చాలా బ్యాడ్ న్యూస్. కొద్దిరోజులుగా గాయాలతో బాధపడుతున్న ఆటగాళ్లపై బీసీసీఐ మెడికల్ అప్ డేట్ ఇచ్చింది. బెంగళూరులోని NCAలో గత కొన్నిరోజులుగా శిక్షణ తీసుకుంటున్న వీరిద్దరూ.. ఫిట్ నెస్ గురించి చాలా కష్టపడుతున్నారు. అంతేకాకుండా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో బయటికి వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ చేదు వార్తతో అటు టీమిండియాతో పాటు అభిమానులు కూడా బాధపడాల్సి వస్తుంది.
MLA Dr Ranganath: ఆపరేషన్‌కు సాయం కోసం వెళ్లాడు.. తానే స్వయంగా ఆపరేషన్ చేశాడు డాక్టర్ ఎమ్మెల్యే
మరోవైపు ఆసియా కప్‌కు ఇంకా ఒక నెల కంటే తక్కువ సమయం ఉంది. ఆ తర్వాత ఒక నెల తర్వాత ప్రపంచ కప్ ప్రారంభమవుతుంది. గతేడాది ఆసియా కప్ టీ 20లో భాగంగా కనీసం ఫైనల్ కి వెళ్లలేకపోయింది టీమిండియా. ఈ నేపథ్యంలో ఈ సారి ఆసియా కప్ ఎలాగైనా కొట్టాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు ఈ రెండు టోర్నీల కోసం సిద్ధమవుతున్న టీమిండియా.. వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్ లో.. కొత్త వారికి అవకాశం వచ్చింది. అయితే కొంతమంది ఆటగాళ్లను ఆసియా కప్‌లో ఆడించాలని బీసీసీఐ చూస్తుంది. ఎందుకంటే టీమిండియాలో ఇద్దరు స్టార్ ప్లేయర్లు కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ ఆడటం కష్టంగా ఉంది. ఆసియా కప్ ఆగస్టు 30 నుంచి పాకిస్థాన్‌లో ప్రారంభం కానుండగా.. టీమిండియా తన తొలి మ్యాచ్‌ను సెప్టెంబర్ 2న శ్రీలంకలోని క్యాండీలో పాకిస్థాన్‌తో ఆడనుంది.
Minister Amarnath: దసరాకు విశాఖ ప్రజల కోరిక తీరబోతుంది.. మంత్రి అమర్నాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఈ ఏడాది చాలా మంది భారత క్రికెటర్లు గాయాల కారణంగా ఐపీఎల్ తో పాటు డబ్ల్యూటీసీ ఫైనల్ కి కూడా దూరమయ్యారు. బుమ్రా, రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ లాంటి ప్లేయర్లు ఈ లిస్టులో ఉన్నారు. ప్రస్తుతం వీరందరూ కోలుకోవడం టీమిండియాకు చాలా అవసరం. గత కొంతకాలంగా టీమిండియాలో అయ్యర్ అన్ని ఫార్మాట్ లలో కీలక ప్లేయర్ గా మారాడు. అసలే రాహుల్ కూడా అందుబాటులో లేకపోవడంతో ఇప్పుడు మిడిల్ ఆర్డర్ లో ఎవరిని ఆడించాలో టీమిండియాకు పెద్ద తలనొప్పిగా మారింది. డబ్ల్యూటీసీ ఫైనల్లో కూడా వీరిద్దరు లోటు స్పష్టంగా కనిపించింది. ఈ నేపథ్యంలో రాహుల్, అయ్యర్ ఆసియా కప్ కి దూరమవుతుండటంతో.. టీమిండియా ఆసియా గెలవడం కష్టంగానే కనిపిస్తుంది. మరి వీరిద్దరూ కనీసం వరల్డ్ కప్ కి అందుబాటులో ఉంటారో లేదో చూడాలి.