కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఏప్రిల్ 21న కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్లు తలపడనున్నాయి. ఈ సీజన్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ మొత్తం 6 మ్యాచ్ లలో 4 గెలిచి పాయింట్ల పట్టికలో 3వ స్థానంలో ఉంది. మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆడిన 7 మ్యాచ్ లలో 1 మ్యాచ్ మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది. నేటి మధ్యాహ్నం 3:30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది.
Also Read: Robbery: మర్రిచెట్టు తొర్రలో రూ.66 లక్షలు.. అవాక్కైన పోలీసులు
ఇక ఈ ఇరుజట్లు కోల్‌కతా, బెంగళూరులు ఇప్పటి వరకు 33 ఐపీఎల్ మ్యాచ్ లు ఆడాయి. అందులో కోల్‌కతా 19 మ్యాచ్ లలో విజయం సాధించగా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 14 మ్యాచ్ లు మార్త్రమే గెలిచింది. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పై కోల్‌కతా అత్యధిక స్కోరు 222. ఇక అలాగే కోల్‌కతా నైట్ రైడర్స్ పై రాయల్ ఛాలెంజర్స్ అత్యధిక స్కోరు 213.
Also Read: Prasanth Varma: తనే నా మొదిటి హీరో.. ప్రశాంత్ వర్మ కామెంట్స్..
ఇక నేటి మ్యాచ్ ఆటగాళ్ల విషయానికి వస్తే.. కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) ప్రాబబుల్ XI జట్టులో ఫిల్ సాల్ట్ (Wk), సునీల్ నరైన్, అంగ్క్రిష్ రఘువంశీ, శ్రేయాస్ అయ్యర్ (c), వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, రమణదీప్ సింగ్, ఆండ్రీ రస్సెల్, మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా, వరుణ్ చకరవర్తిలు ఉండొచ్చని అంచనా. ఇక మరోవైపు..
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ప్రాబబుల్ XI జట్టులో ఫాఫ్ డు ప్లెసిస్ (సి), విరాట్ కోహ్లి, విల్ జాక్స్, రజత్ పాటిదార్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్ (WK), మహిపాల్ లోమ్రోర్, లాకీ ఫెర్గూసన్, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్, మయాంక్ దాగర్ లు ఉండొచ్చు. ఇక ఈ మ్యాచ్ లో ఆర్‌సీబీ జెర్సీ మారనుంది.