Kishan Reddy: ప్రధాని టీ అమ్మిన రైల్వే స్టేషన్‌కు కిషన్ రెడ్డి.. వెళ్లింది అందుకోసమా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kishan Reddy: ప్రధాని మోడీ తన చిన్నతనంలో ఏం చేశాడంటే అందరికీ తెలిసిన విషయమే.. తన నాన్నకు సహాయంగా ఆయన కూడా టీ అమ్మారు. ఆ ప్రాంతం ఎక్కడనుకుంటున్నారా..? గుజరాత్ రాష్ట్రంలోని వాద్ నగర్. ఆ ప్రాంతాన్ని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి సందర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మస్థలమైన గుజరాత్‌లోని వాద్నగర్లో బుధవారం పర్యటించారు. ప్రాచీన పట్టణం, గొప్ప చరిత్రను వెలుగులోకి తెచ్చే “అనంత్ అనాది వాద్నగర్” డాక్యూసిరీస్ ప్రదర్శనను పురస్కరించుకుని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వాద్‌నగర్‌లోని రైల్వే స్టేషన్, తదితర ప్రాచీన ప్రాంతాలను సందర్శించారు.
Read Also: Harish Rao: పక్క రాష్ట్రాలు, దేశాలకు అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగింది
Also Read
2022లో వాద్‌నగర్‌ను యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చారు. ఈ నేపథ్యంలో ప్రాచీన పట్టణ విశిష్టతను, గొప్ప చరిత్రను చాటిచెప్పే విధంగా కేంద్ర పర్యటక శాఖ.. పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. వాద్నగర్లో గత 2700 సంవత్సరాల నుంచి ప్రజలు నివసిస్తున్నట్లు గుర్తింపులు ఉన్నాయి. ఈ చారిత్రాత్మక పట్టణమైన వాడ్నగర్ను భారతదేశంలోని చారిత్రక జీవన నగరాలైన మధుర, ఉజ్జయిని, పాట్నా, వారణాసితో పోల్చవచ్చు.
Read Also: Shanmukh Jaswanth : వీలు చైర్ లో దారుణమైన స్థితిలో కనిపించిన షణ్ముఖ్..?
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గుజరాత్ పర్యటన సందర్భంగా.. బుధవారం వాద్ నగర్ రైల్వే స్టేషన్ ను సందర్శించారు. ఈ సందర్భంగా రైల్వే అధికారులు, పర్యాటక శాఖ అధికారులతో కలిసి టీ తాగారు. వారితో పలు విషయాలపై చర్చించారు. దీంతోపాటు రైల్వే స్టేషన్ ఆధునికీకరణ, తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు కిషన్ రెడ్డి. అంతేకాకుండా అదే రైల్వేస్టేషన్ లో చిన్నతనంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. తన నాన్నకు టీ అమ్మడంలో సహాయం చేసేవారు. దాదాపు 1880లలో వాద్ నగర్ రైల్వే స్టేషన్ ను నిర్మించారు. ఈ స్టేషన్ ఇప్పుడు అత్యాధునిక సౌకర్యాలు, వసతులతో స్థానిక ప్రయాణికులకు సేవలు అందిస్తోంది.
తాజావార్తలు
-
PM Modi: అది ‘‘హిందూ గ్రోత్ రేట్’’ కాదు, ‘‘కాంగ్రెస్ గ్రోత్ రేట్’’
-
Gurnoor Brar: 17 ఏళ్ల వయసులో క్రికెట్ ప్రారంభం.. 9 ఏళ్ల కష్టానికి టీమిండియా పిలుపు..
-
Rao Bahadur Teaser: ఈసారి సత్యదేవ్ కొట్టేలా ఉన్నాడు.. ‘రావు బహదూర్’ టీజర్ డేట్ ఫిక్స్.. రిలీజ్ డేట్ అప్పుడే!
-
Nandini Reddy: ‘పెద్ది’ వివాదంపై నందిని రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బుచ్చిబాబు తప్పు ఒప్పుకున్నాడు!
-
Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!