ప్రధాని మోడీ సొంత గ్రామం గుజరాత్‌లోని వాద్‌నగర్‌లో అరుదైన నాణేలు లభ్యమయ్యాయి. దశాబ్ద కాలంగా పురావస్తు శాస్త్రవేత్తలు చేస్తున్న పరిశోధనల్లో ఇండో-గ్రీకుకు చెందిన నాణేల అచ్చులు లభ్యమయ్యాయి.
ప్రధాని మోడీ తన చిన్నతనంలో ఏం చేశాడంటే అందరికీ తెలిసిన విషయమే.. తన నాన్నకు సహాయంగా ఆయన కూడా టీ అమ్మారు. ఆ ప్రాంతం ఎక్కడనుకుంటున్నారా..? గుజరాత్ రాష్ట్రంలోని వాద్ నగర్. ఆ ప్రాంతాన్ని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి సందర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మస్థలమైన గుజరాత్‌లోని వాద్‌నగర్‌లో బుధవారం పర్యటించారు.