భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి కార్యక్రమంలో కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులార్పించారు కిషన్ రెడ్డి. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. సమాజంలో అట్టడుగు వర్గాన ఉన్న వ్యక్తులకు, సమాజంలో నిర్లక్ష్యానికి గురైన పేదవాళ్లకు ప్రభుత్వ పథకాలలో తొలి ప్రయోజనం చేకూరాలని అంత్యోదయ విధానాన్ని రూపొందించిన మహనీయుడు పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ అని ఆయన కొనియాడారు. అట్టడుగు వర్గాలకు సంక్షేమ పథకాలు చేరేలా కృషి చేయడం, వారిని వృద్ధిలోకి తీసుకురావాలని కాంక్షించారని, రాజకీయాలకు అతీతంగా నిస్వార్థంగా ప్రజలకు సేవలందించాలని ఆయన పిలుపునిచ్చారన్నారు.
Also Read : IND vs AUS 3rd ODI: ఆస్ట్రేలియాతో మూడో వన్డే.. ఇద్దరు భారత స్టార్స్ ఔట్!
అంతేకాకుండా.. ‘భారతీయ జనసంఘం వ్యవస్థాపకులు పండిట్‌జీ మరణం ఇంకా మిస్టరీగానే మిగిలిపోవడం బాధాకరం. దేశ ప్రజలు, రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించిన గొప్ప వ్యక్తి దీన్ దయాల్. విద్యార్థులు, బడుగు బలహీన వర్గాలు, మహిళలు.. ఇలా అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేయడమే లక్ష్యం. నరేంద్ర మోదీ ప్రభుత్వం దీన్ దయాల్ ప్రవచించిన అంత్యోదయ సిద్ధాంతాన్ని ఆచరణలో పెడుతూ, వారి ఆశయాలకు పునరంకితమై పనిచేస్తోంది. పేద ప్రజలకు మేలు జరిగేలా ఉజ్వల యోజన ద్వారా పేదలకు గ్యాస్, జన్ ధన్ ఖాతాలు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా పేదవారికి ఇండ్లు, స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా టాయిలెట్ల నిర్మాణం చేపడుతోంది.
Also Read : Jowar Laddu : ఎదిగే పిల్లలకు పౌష్టికాహారం.. జొన్నలడ్డు తయారీ విధానం..
మారుమూల ప్రాంతాలకు దీన్ దయాళ్ గ్రామ జ్యోతి యోజన ద్వారా ప్రతి గ్రామానికి కరెంట్ సరఫరా, ప్రతి ఇంటికీ తాగునీటి సదుపాయాన్ని కల్పిస్తూ దేశంలోని ప్రతి ఒక్కరికి మేలు జరిగేలా సేవలందిస్తోంది. దీన్ దయాళ్ సిద్ధాంతాలకు అనుగుణంగా, ఆశయాలకు అనుగుణంగా నరేంద్రమోదీ ప్రభుత్వం అనేక పథకాలు రూపొందించి, ఆచరణలో చూపెడుతోంది. సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ అనే నినాదంతో దీన్దయాళ్ఆలోచనలకు అనుగుణంగా భారత ప్రభుత్వం దృఢ సంకల్పంతో ముందుకెళ్తోంది. దీన్ దయళ్ గారి ఆశయాలకు అనుగుణంగా, క్రమశిక్షణ గల కార్యకర్తలుగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలమంతా పనిచేస్తాం. అవినీతికి వ్యతిరేకంగా, కుటుంబ రాజకీయాలకు తావివ్వకుండా, అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసేలా ముందుకెళ్తాం.’ అని ఆయన అన్నారు.