NTV Telugu Site icon

Kishan Reddy: కాంగ్రెస్ డబుల్ హ్యాట్రిక్ జీరో సాధించింది..

Kishan Reddy

Kishan Reddy

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయాన్ని అందుకుంది. 70 స్థానాలున్న ఢిల్లీలో.. బీజేపీ 47 స్థానాల్లో విజయాన్ని అందుకుంది. ఆప్‌ 23 స్థానాలకే పరిమితం అయ్యింది. కాంగ్రెస్‌ పార్టీ అయితే ఖాతా కూడా తెరవలేదు. ఢిల్లీలో బీజేపీ విజయంపై తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు, ఆప్‌కు ఢిల్లీ ప్రజలు పట్టం కడుతూ వచ్చారు.. 27 ఏళ్ల తర్వాత బీజేపీని అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించారని తెలిపారు. మోడీ సుపరిపాలనకు ప్రజలు ఆశీస్సులు అందించారు.. ఢిల్లీకి పట్టిన కేజ్రీవాల్ గ్రహణం.. దేశ రాజధానికి పట్టిన పీడ విరగడైందని ఆరోపించారు.

Read Also: Bengaluru Metro: ప్రయాణికులపై మెట్రో బాదుడు.. భారీగా పెరిగిన ఛార్జీలు

ఢిల్లీలో నీతివంతమైన, అభివృద్ది పాలన బీజేపీ అందించబోతుందని కిషన్ రెడ్డి తెలిపారు. అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా కేజ్రీవాల్ మారిపోయారని దుయ్యబట్టారు. అహంకారం నెత్తికిక్కితే ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారో, ప్రజలు సహించరు అని మరోసారి తేలిపోయిందన్నారు. ప్రజలు డిసైడ్ అయితే కేజ్రీవాల్, రాహుల్ గాంధీ, కేసీఆర్ ఎవరు ఆపలేరని అన్నారు. కాంగ్రెస్ డబుల్ హ్యాట్రిక్ జీరో సాధించిందని విమర్శించారు. వరుసగా మూడుసార్లు పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి జీరో సీట్లు వచ్చాయని పేర్కొన్నారు. ఆ పార్టీకి మోడీని ఓడించాలని దివాలాకోరు ఆలోచన తప్పా.. ప్రజల కోసం ఆలోచించదని దుయ్యబట్టారు.

Read Also: Telangana: కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల ప్రక్రియకు బ్రేక్..

రాజ్యాంగం బుక్‌ను చేతిలో పట్టుకుంటే ఓట్లు వేయరు.. రాజ్యాంగ విలువలను పాటిస్తే ఓట్లు పడతాయి అని రుజువు అయిందని కిషన్ రెడ్డి అన్నారు. లిక్కర్ కుంభకోణంపై ఢిల్లీ ప్రజలు తీర్పు ఇచ్చారు.. దోపిడి జరిగిందని ఢిల్లీ ప్రజలు తీర్పు ఇచ్చారని అన్నారు. లిక్కర్ స్కాంలో కోర్ట్ తీర్పు రావాల్సి ఉంది.. న్యాయస్థానం తీర్పు ఇస్తుందని దేశ ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. ఉత్తుత్తి హామీలు, ఉచితాలు అవసరం లేదని ఢిల్లీ ప్రజలు తీర్పు ఇచ్చారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.