Kishan Reddy: కాంగ్రెస్ డబుల్ హ్యాట్రిక్ జీరో సాధించింది..
- ఢిల్లీలో బీజేపీ విజయంపై స్పందించిన కిషన్ రెడ్డి
- అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు, ఆప్‌కు ఢిల్లీ ప్రజలు పట్టం కడుతూ వచ్చారు..
- 27 ఏళ్ల తర్వాత బీజేపీని అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించారు- కిషన్ రెడ్డి
- మోడీ సుపరిపాలనకు ప్రజలు ఆశీస్సులు అందించారు- కిషన్ రెడ్డి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయాన్ని అందుకుంది. 70 స్థానాలున్న ఢిల్లీలో.. బీజేపీ 47 స్థానాల్లో విజయాన్ని అందుకుంది. ఆప్ 23 స్థానాలకే పరిమితం అయ్యింది. కాంగ్రెస్ పార్టీ అయితే ఖాతా కూడా తెరవలేదు. ఢిల్లీలో బీజేపీ విజయంపై తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు, ఆప్‌కు ఢిల్లీ ప్రజలు పట్టం కడుతూ వచ్చారు.. 27 ఏళ్ల తర్వాత బీజేపీని అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించారని తెలిపారు. మోడీ సుపరిపాలనకు ప్రజలు ఆశీస్సులు అందించారు.. ఢిల్లీకి పట్టిన కేజ్రీవాల్ గ్రహణం.. దేశ రాజధానికి పట్టిన పీడ విరగడైందని ఆరోపించారు.
Read Also: Bengaluru Metro: ప్రయాణికులపై మెట్రో బాదుడు.. భారీగా పెరిగిన ఛార్జీలు
Also Read
- Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
- GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
ఢిల్లీలో నీతివంతమైన, అభివృద్ది పాలన బీజేపీ అందించబోతుందని కిషన్ రెడ్డి తెలిపారు. అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా కేజ్రీవాల్ మారిపోయారని దుయ్యబట్టారు. అహంకారం నెత్తికిక్కితే ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారో, ప్రజలు సహించరు అని మరోసారి తేలిపోయిందన్నారు. ప్రజలు డిసైడ్ అయితే కేజ్రీవాల్, రాహుల్ గాంధీ, కేసీఆర్ ఎవరు ఆపలేరని అన్నారు. కాంగ్రెస్ డబుల్ హ్యాట్రిక్ జీరో సాధించిందని విమర్శించారు. వరుసగా మూడుసార్లు పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి జీరో సీట్లు వచ్చాయని పేర్కొన్నారు. ఆ పార్టీకి మోడీని ఓడించాలని దివాలాకోరు ఆలోచన తప్పా.. ప్రజల కోసం ఆలోచించదని దుయ్యబట్టారు.
Read Also: Telangana: కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల ప్రక్రియకు బ్రేక్..
రాజ్యాంగం బుక్‌ను చేతిలో పట్టుకుంటే ఓట్లు వేయరు.. రాజ్యాంగ విలువలను పాటిస్తే ఓట్లు పడతాయి అని రుజువు అయిందని కిషన్ రెడ్డి అన్నారు. లిక్కర్ కుంభకోణంపై ఢిల్లీ ప్రజలు తీర్పు ఇచ్చారు.. దోపిడి జరిగిందని ఢిల్లీ ప్రజలు తీర్పు ఇచ్చారని అన్నారు. లిక్కర్ స్కాంలో కోర్ట్ తీర్పు రావాల్సి ఉంది.. న్యాయస్థానం తీర్పు ఇస్తుందని దేశ ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. ఉత్తుత్తి హామీలు, ఉచితాలు అవసరం లేదని ఢిల్లీ ప్రజలు తీర్పు ఇచ్చారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!