Kishan Reddy: పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతారు కానీ.. ఓవైసీ దగ్గర వంగి వంగి సలాంలు కొడతారు!
- కాంగ్రెస్, బీఆర్ఎస్లు మజ్లిస్‌కు అండగా నిలబడుతున్నాయి
- కార్పొరేటర్లను ఓటు వేయకుండా బీఆర్ఎస్ పార్టీ బెదిరుస్తుంది
- ఏ ప్రాతిపదికన కేసీఆర్ పోటీ చేయడం లేదో చెప్పాలి
- ఓవైసీ దగ్గర వంగి వంగి సలాంలు కొడతారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ నగరంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో కాంగ్రెస్, బీఆర్ఎస్లు పోటీ చేయకుండా మజ్లిస్‌కు అండగా నిలబడుతున్నాయని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఎన్నికైన కార్పొరేటర్లను ఓటు వేయకుండా బీఆర్ఎస్ బెదిరుస్తుందన్నారు. అత్యధిక ఓట్లు ఉన్నా ఏ ప్రాతిపదికన పోటీ చేయడం లేదో చెప్పాలన్నారు. పచ్చి మతోన్మాద, రజాకారు మజ్లిస్‌కు సపోర్ట్ చేస్తున్న ఈ రెండు పార్టీలు సెక్యులర్ పార్టీలు ఎలా అవుతాయని ప్రశ్నించారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో హైదారాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పరిధిలోని కాకార్పొరేటర్లతో కిషన్ రెడ్డి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
‘కాంగ్రెస్, బీఆర్ఎస్లు పోటీ చేయకుండా మజ్లిస్‌కు అండగా నిలబడుతున్నాయి. ఎన్నికైన కార్పొరేటర్లను ఓటు వేయకుండా బీఆర్ఎస్ పార్టీ బెదిరుస్తుంది. ఇది తమకు ఓటు వేసి గెలిపించిన ప్రజలను అవమానించడమే. ఎంఐఎం కోసం ప్రజలు కాంగ్రెస్, బీఆర్ఎస్కు ఓటు వేయలేదు. బీజేపీని ఓడించేందుకు ఈ రెండు పార్టీలు పోటీ చేస్తాయి. పచ్చి మతోన్మాద, రజాకారు మజ్లిస్‌కు సపోర్ట్ చేస్తున్న ఈ రెండు పార్టీలు సెక్యులర్ పార్టీలు ఎలా అవుతాయి. సెక్యులర్ అని రాహుల్ గాంధీ ఏ ముఖం పెట్టుకుని ప్రచారం చేస్తున్నారు. మజ్లిస్ పార్టీ రజాకర్ పార్టీ అవునా? కదా? రాహుల్ గాంధీ చెప్పాలి.మజ్లిస్ పార్టీ మోచేతి నీళ్లు ఎందుకు తాగుతున్నారు. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మజ్లిస్‌కు వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇచ్చారు. 15 నిమిషాల సమయం ఇస్తే వందకోట్ల హిందువుల సంగతి చూస్తామన్న మజ్లిస్ పార్టీకి ఎందుకు మద్దతు ఇస్తున్నారో చెప్పాలి. బయట ఈ రెండు పార్టీలు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతారు కానీ ఓవైసీ దగ్గర వంగి వంగి సలాంలు కొడతారు’ అని కిషన్ రెడ్డి మండిపడ్డారు.
Also Read
- Bus Fire Accident: మీర్పేట్లో బస్సులో భారీ అగ్నిప్రమాదం.. తృటిలో తప్పిన పెను ప్రమాదం!
- 100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
- CM Chandrababu: వర్షాలపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు
- 8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
‘ఏ ప్రాతిపదికన కేసీఆర్ పోటీ చేయడం లేదో చెప్పాలి. ఎవరిని గెలిపించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. కార్పొరేటర్లను పిలిచి ఓటు వేయొద్దని ఎందుకు బెదిరిస్తున్నారు. మీకు చీము నెత్తురు ఉంటే ఎంఐఎంకు బహిరంగంగా ఎందుకు ఓటు వేయరు. మీ బాస్ (ఒవైసీ)ను బుజగించేందుకు దూరంగా ఉండాలని నిర్ణయం. కాంగ్రెస్ పార్టీ పాత బస్తీలో డిపాజిట్ రాదని తెలిసినా పోటీ చేసింది.. ఇప్పుడు ఎందుకు పోటీ చేయడం లేదో చెప్పాలి. మజ్లిస్ పార్టీని తెలంగాణకు ముఖ్యమంత్రిని చేయడానికి ఈ రెండు పార్టీలు పోటీ పడుతాయి. ఇప్పటికే హైదారాబాద్ నగరంను ఎంఐఎంకు అప్పగించాయి’ అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Vivo Y600i: వివో Y600i లిస్టింగ్.. 6.87 అంగుళాల డిస్ప్లే, 8,000mAh బ్యాటరీ!
-
Horror Stories : మళ్లీ హారర్ కామెడీ, హారర్ థ్రిల్లర్స్‌పై బాలీవుడ్ ఫోకస్
-
Tragedy: స్లీపర్ బస్సు అగ్నికి ఆహుతి.. 9 మంది ప్రయాణికులు మృతి
-
KVN : కేవియన్ ఖాతాలో మరో డిజాస్టర్.. బాక్సాఫీస్ బాంబ్‌గా హైవాన్
-
Bus Fire Accident: మీర్పేట్లో బస్సులో భారీ అగ్నిప్రమాదం.. తృటిలో తప్పిన పెను ప్రమాదం!
ట్రెండింగ్
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!