Vaibhav Sooryavanshi: టీ20ల్లో చరిత్ర సృష్టించే ఛాన్స్.. వైభవ్ సూర్యవంశీ ఆ రికార్డు బద్దలు కొడతాడా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vaibhav Sooryavanshi: భారత్-జింబాబ్వే మధ్య ఇవాళ ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీపై అంతా దృష్టి సారించారు.. కేవలం 15 ఏళ్ల వయసులోనే భారత జట్టులో చోటు దక్కించుకున్న ఈ యువ బ్యాటర్‌కు టీ20 క్రికెట్లో అరుదైన ప్రపంచ రికార్డు సాధించే అవకాశం లభించింది. ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ టీ20 క్రికెట్లో 37 ఇన్నింగ్స్‌ల్లో 139 సిక్సర్లు బాదాడు. జింబాబ్వేతో జరిగే ఈ సిరీస్‌లో మరో 11 సిక్సర్లు కొడితే అతని ఖాతాలో 150 సిక్సర్లు చేరతాయి. దీంతో అత్యల్ప ఇన్నింగ్స్‌ల్లో 150 టీ20 సిక్సర్లు పూర్తి చేసిన ప్రపంచ రికార్డును తన పేరిట నమోదు చేసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ రికార్డు యూఏఈ బ్యాటర్ మహ్మద్ వసీమ్ పేరిట ఉంది. అతను 66 ఇన్నింగ్స్‌ల్లో 150 సిక్సర్ల మైలురాయిని అందుకున్నాడు.
ఇంగ్లండ్‌తో ఇటీవల జరిగిన టీ20 సిరీస్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన వైభవ్‌కు జింబాబ్వే సిరీస్ తన ప్రతిభను నిరూపించుకునే మంచి అవకాశం కానుంది. మూడు మ్యాచ్‌ల్లోనూ అతడికి అవకాశం లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భావిస్తున్నారు. మరోవైపు, హరారే మైదానంతో వైభవ్‌కు ప్రత్యేక అనుబంధం ఉంది. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో ఇంగ్లండ్‌పై ఇదే వేదికలో అతడు 175 పరుగుల రికార్డు ఇన్నింగ్స్ ఆడి భారత్‌కు టైటిల్ అందించడంలో కీలక పాత్ర పోషించాడు. అలాగే జింబాబ్వేలో ఆడిన ఏడు యూత్ వన్డేల్లో 62.17 సగటుతో 439 పరుగులు చేశాడు. ఈ గణాంకాలు చూస్తే హరారేలో అతడు మరోసారి భారీ ఇన్నింగ్స్ ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జింబాబ్వే సిరీస్‌లో వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్‌పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.
Also Read
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Sandeep Patil: సచిన్, యువీ, గంభీర్, జహీర్‌ను ఎందుకు తప్పించారు..? సీక్రెట్ బయటపెట్టిన సెలక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్
- Virat Kohli - Rohit Sharma: 2027 వరల్డ్‌కప్‌కు ముందు రోహిత్-విరాట్‌పై కైఫ్ కీలక వ్యాఖ్యలు
- Virat Kohli 100 Centuries: 100 సెంచరీలు కొట్టలేడు..! కోహ్లీపై టీమిండియా మాజీ స్టార్ ఆసక్తికర కామెంట్స్
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్… హైదరాబాద్‌లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..