Romanchakam: ప్రేమలో మునిగిపోయే మెలోడీ.. ‘రొమాంచకం’ నుంచి ‘రాధా రమణ’ పాట రిలీజ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Romanchakam: ప్రేమకథలకు సంగీతం ఎంత ప్రాధాన్యం ఉంటుందో చెప్పక్కర్లేదు. ప్రేక్షకుల హృదయాలను తాకేలా పాటలు ఉంటే సినిమాకు కూడా ఢోకా ఉండదు. ఇప్పుడు అలాంటి మధురమైన అనుభూతినే అందించేందుకు సిద్ధమైంది ‘రొమాంచకం’. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌తో యువతలో ఆసక్తిని పెంచిన ఈ చిత్రం, ఇప్పుడు తొలి పాట ‘రాధా రమణ’తో మరోసారి ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ పాట సినిమా విడుదలకు ముందే మంచి స్పందన అందుకుంటోంది. రాధా కృష్ణుల ప్రేమను గుర్తు చేసేలా రూపొందిన ఈ పాట, సంగీతంతో పాటు దృశ్యపరంగానూ ఆకట్టుకుంటోంది. ఈ గీతానికి సంగీత దర్శకుడు వాసుకి వైభవ్ స్వరాలు సమకూర్చడమే కాకుండా స్వయంగా ఆలపించారు. ఇక ఈ పాట కూడా ప్రేమలోని మాధుర్యాన్ని చాలా చక్కగా అందిస్తోంది.
ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ అందించిన సాహిత్యంతో ఈ పాట వినసొంపుగా మారింది. పాటలో సుమంత్ ప్రభాస్, అనంతిక సనీల్‌కుమార్ మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అనంతిక తన అందమైన డ్యాన్స్ తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక ఈ సినిమాకి వేణు గోపాల్ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. భద్రకాళి పిక్చర్స్ బ్యానర్‌పై సందీప్ రెడ్డి వంగా, ప్రణయ్ రెడ్డి వంగా సహకారంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ మంచి స్పందన తెచ్చుకోగా, ఇప్పుడు ‘రాధా రమణ’ పాట కూడా అదే స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ప్రేమ, మధురమైన సంగీతంతో నిండిన ఈ పాట ‘రొమాంచకం’పై అంచనాలను మరింత పెంచింది. సెప్టెంబర్ 3న థియేటర్లలో విడుదల కానున్న ఈ మూవీ యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా మంచి గుర్తింపు తెచ్చుకుంటుందనే నమ్మకాన్ని చిత్రబృందం వ్యక్తం చేస్తోంది. ఇప్పుడు అభిమానులు ఈ సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read
- Balakrishna - Koratala Siva: కొరటాల మూవీలో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్.. ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు బాలయ్యలు!
- Mega Podcast: దశాబ్దం తర్వాత డిజిటల్ స్క్రీన్‌పై మెగా హోస్టింగ్.. ఆ రెమ్యునరేషన్ లెక్కలు ఏంది బాస్!
- Suriya: స్టేజ్‌పై డైరెక్టర్ రాజమౌళికే స్వీట్ షాక్ ఇచ్చిన స్టార్ హీరో సూర్య! వైరల్ అవుతున్న వీడియో...
- Ranabali Documentary: కథపై హైప్ పెంచుతుందా? ఆసక్తిని చంపేస్తుందా?.. రణబాలి డాక్యుమెంటరీ స్ట్రాటజీపై హాట్ డిబేట్!
- Tags
- cinema
- Romanchakam
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!