Danish Kaneria: “రాముడు, మోడీ, హిందుత్వాన్ని తిట్టడమే నిరసనా?”.. సీజేపీ ఆందోళనలపై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Danish Kaneria: భారత్‌లో జంతర్ మంతర్ వద్ద నీట్ (NEET) పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) చేపడుతున్న విద్యార్థుల నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను డిమాండ్ చేస్తూ దాదాపు నెల రోజులుగా విద్యార్థులు చేపడుతున్న ఈ ఆందోళనపై స్పందిస్తూ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ఓ ట్వీట్ చేశారు. ఈ నిరసనను ఒక ‘సర్కస్’, ‘తమాషా’ అని అభివర్ణించాడు. భారత్‌లో జరిగే ప్రతీ నిరసన ప్రదర్శనలోనూ శ్రీరాముడిని, భారతావనిని, ప్రధాని మోదీని, ప్రధాని మోదీ దివంగత తల్లిని, బ్రాహ్మణులను అలాగే హిందూత్వాన్ని దూషించడమే పనిగా పెట్టుకున్నారని కనేరియా తీవ్ర విమర్శలు చేశాడు. ఒకానొక రోజు భారత్‌లో నేపాల్ లాంటి పరిస్థితిని సృష్టించగలమనే భ్రమలో ప్రతిపక్షం జీవిస్తున్నట్లు అనిపిస్తోందని అభిప్రాయం వ్యక్తం చేశాడు. మరోవైపు.. అమెరికాతో ఇంకా ఒక్క వాణిజ్య ఒప్పందం కూడా కుదరలేదు, కానీ కొంతమంది రైతులు ఇప్పటికే ఢిల్లీని దిగ్బంధించడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నాడు. ఇది ఒక సర్కస్‌గా మారుతోందంటూ ట్వీట్ చేశాడు. చర్చలు, పరిష్కారాలు లేకుండా కేవలం అరాచకం సృష్టించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని పేర్కొన్నాడు. అసలు విషయాలు తెలుసుకోకుండానే విపక్షాలు, కొందరు ప్రజలు నిరసనలకు దిగడం వల్ల దేశ పురోగతి ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించాడు.
మరోవైపు.. పాకిస్థానీ అయి ఉండి భారతీయ విద్యార్థుల ఆందోళనను అవహేళన చేసేలా ట్వీట్ చేయడంతో భారత నెటిజన్లు కనేరియాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్రికెట్ చరిత్రలో పాకిస్థాన్ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన కేవలం ఇద్దరు హిందూ క్రికెటర్లలో కనేరియా ఒకరు. 2000 నుంచి 2010 మధ్య 61 టెస్టుల్లో 261 వికెట్లు తీసి అత్యంత విజయవంతమైన లెగ్ స్పిన్నర్‌గా నిలిచినా, 2012లో ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఆయనపై స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో జీవితకాల నిషేధం విధించింది. తాను పాకిస్థాన్ జట్టులో ఉన్నప్పుడు హిందువునైనందున తీవ్ర వివక్ష ఎదుర్కొన్నానని, మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది తనను ఇస్లాంలోకి మారాలని ఒత్తిడి చేయడమే కాకుండా కనీసం తనతో కలసి భోజనం కూడా చేసేవాడు కాదని కనేరియా గతంలో సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
Also Read
- Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
- IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు..
- CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
- RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
I am disturbed because every protest in India seems to have the same script.
1. Abuse Lord Ram.
2. Abuse Bharat Mata.
3. Abuse PM Modi.
4. Abuse PM Modi’s late mother.
5. Abuse Brahmins.
6. Abuse Hindutva.
No discussion.
No solutions.
Only slogans, abuse, and chaos.
The…
— Danish Kaneria (@DanishKaneria61) July 22, 2026
తాజావార్తలు
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు..
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
-
RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
ట్రెండింగ్
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!