Kishan Reddy: అధికారంలోకి వస్తే రైతు పండించే ప్రతి పంటకు భీమా కల్పిస్తాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మోడీ సర్కార్ రాకముందు దేశ వ్యాప్తంగా విద్యుత్ కొరత ఉండేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇప్పుడు వ్యవసాయ రంగానికి దేశంలో ఎక్కడ విద్యుత్ కోతలు లేవని తెలిపారు. రామగుండం NTPCకి మోడీనే శంఖుస్థాపన చేశారు, ప్రారంభం చేశారని కేంద్రమంత్రి అన్నారు. ఎరువుల సమస్యను తీర్చింది మోడీనేనని.. కొరత, కోతలు లేని నూతన భారతావనిని మోడీ ఆవిష్కరించారని పేర్కొన్నారు. 10 ఎకరాలు ఉన్న రైతుకు ఎరువుల మీద 2 లక్షల సబ్సిడీ కేంద్రం ఇస్తుందని తెలిపారు. ఎరువుల పరిశ్రమ, NTPC ప్రాజెక్ట్ ప్రారంభానికి మోడీ వస్తే కేసీఆర్ ఫాంహౌస్, ప్రగతి భవన్ లో పడుకున్నాడని విమర్శించారు.
కొడుకు సీఎం, అయన జాతీయ నేత కావాలని శ్రద్ద తప్ప కేసీఆర్ కి తెలంగాణ ప్రజల పై లేదని కిషన్ రెడ్డి అన్నారు. ఓట్ల పైన ధ్యాస తప్ప తెలంగాణ అభివృద్ది పై ఆయనకు చితశుద్ది లేదని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఫిజిబిలిటీ కాదు… దాన్ని మెంటైన్ చేయలేమని అంటున్నారని తెలిపారు. ఇంజనీర్లను పక్కన పెట్టి ఫాంహౌస్ ఇంజనీర్ గా మారి తెలంగాణ ప్రాజెక్ట్ లను కేసీఆర్ ముంచుతున్నాడని దుయ్యబట్టారు. కృష్ణా ట్రిబ్యునల్ ఆలస్యానికి కారణం కేసీఆరేనని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ సస్యశ్యామలం కావాలి అంటే నదుల అనుసంధానం జరగాలని తెలిపారు. సాగునీటి ప్రాజెక్టులు కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంలుగా మారాయని విమర్శించారు.
Also Read
- Makkah Deal: మక్కా ఒప్పందంలోకి బంగ్లాదేశ్! భారత్‌పై జమాతే ఇస్లామీ నాయకుడు కీలక వ్యాఖ్యలు
- Amaravati: రాజధాని గ్రామాలకు గుడ్ న్యూస్.. 29 గ్రామాలకు భారీగా నిధులు..
- Raksha Bandhan 2026: రాఖీ ఎప్పుడు కట్టాలి? ఎలా కట్టాలి? శుభ సమయాలతో పాటు రక్షా బంధన్ పూర్తి వివరాలు ఇవే..
- Kangana-kriti: కృతి సనన్ యాడ్ వివాదం వేళ.. కంగనా నేషనల్ అవార్డ్ లుక్ వైరల్
రాష్ట్రంలో మార్పు రావాల్సి ఉందని కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఆకాంక్షలకు విరుద్ధంగా కేసీఆర్ పాలన చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ వ్యవస్థను చిన్నా భిన్నం చేస్తున్నారని.. రాజకీయ వ్యవస్థను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కు అప్పు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వమేనని కిషన్ రెడ్డి తెలిపారు. 7 లక్షల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేసిందని.. కేంద్రం చిత్తశుద్దితో సహకారం చేస్తుంటే వీళ్ళు దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. ఇదిలా ఉంటే.. బీజేపీ అధికారంలోకి వస్తే రైతు పండించే ప్రతి పంటకు భీమా కల్పిస్తామని హామీ ఇచ్చారు. జనవరి ఒకటి నుండి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అమలు చేస్తాయని తెలిపారు. రైతు రాజ్యాన్ని తెలంగాణలో తీసుకొస్తాం… కేసీఆర్ లాగా ఎకరానికి కోటి రూపాయలు వస్తున్నాయని మభ్య పెట్టమన్నారు.
- Tags
- bjp
- BRS
- kcr
- Kishan Reddy
- telugu news
తాజావార్తలు
-
Makkah Deal: మక్కా ఒప్పందంలోకి బంగ్లాదేశ్! భారత్‌పై జమాతే ఇస్లామీ నాయకుడు కీలక వ్యాఖ్యలు
-
Amaravati: రాజధాని గ్రామాలకు గుడ్ న్యూస్.. 29 గ్రామాలకు భారీగా నిధులు..
-
The Paradise : ‘యెషనాగుల’ వచ్చేస్తోంది.. ‘ది ప్యారడైజ్’లో ఊరమాస్ ట్రీట్
-
Raksha Bandhan 2026: రాఖీ ఎప్పుడు కట్టాలి? ఎలా కట్టాలి? శుభ సమయాలతో పాటు రక్షా బంధన్ పూర్తి వివరాలు ఇవే..
-
Kangana-kriti: కృతి సనన్ యాడ్ వివాదం వేళ.. కంగనా నేషనల్ అవార్డ్ లుక్ వైరల్
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!