కేసీఆర్ కథ స్క్రీన్ ప్లే డైరెక్షన్ దేశ ప్రజలకు తెలుసు అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ ఎదుగుదలను ఓర్చుకోలేక కొత్త సినిమాను విడుదల చేసారన్నారు. పస లేని , ఫాల్స్ కేసు , ఏమి జరగని దగర ఏదో జరిగినట్టు చిత్రీకరించే ప్రయత్నం చేశారన్నారు. నిన్న హై కోర్టు మొట్టికాయలు వేసిందని, ఎలాంటి ఆధారాలు లేని కేసులో సిట్ వేశారన్నారు. అంతేకాకుండా.. సీరియల్ లాగా వ్యతిరేక ప్రచారం చేశారు. కేసు దర్యాప్తులో వుండగానే కెసిఆర్ అధరాలను చాలా సంస్థలకు పంపించారు.. ఎమ్మెల్యేల పోన్ లు రికవరీ చేయలేదు… డేటా బయట పెట్టలేదు.. ఎమ్మెల్యేలను ఎందుకు వారాల తరబడి బంధించారో చెప్పలేదు. ఈ కేసులో డబ్బే లేనప్పుడు నన్ను ఈడీ ఎలా విచారిస్తోంది అని ఒక ఎమ్మెల్యే అంటున్నాడు.. డబ్బు సంచులు వచ్చాయి.. వంద కోట్లు బీజేపీ పంపించింది అని సీఎం అన్నారు’ అని ఆయన అన్నారు. ఫాంహౌస్ లో నాగాలి కట్టి పొలం దున్ని పంట పండించి రాష్ట్రాన్ని పాలిస్తున్నట్టు గా కల్వకుంట్ల కుటుంబం మాట్లాడుతుందని, ఏ రకమైన తప్పు బీజేపీ చేయలేదన్నారు కిషన్ రెడ్డి.
Also Read : Rakul Preet Singh: రకుల్ ఇంట విషాదం.. 16 ఏళ్ల బంధం ముగిసిపోయిందంటూ పోస్ట్
కాంగ్రెస్ గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యేల ముందు పెట్టీ బీజేపీ మీద బురద చల్లాలీ అనుకుంటే అది కేసీఆర్ మీదనే పడ్డదని ఆయన అన్నారు. ఫార్మ్ హౌస్ ఫైల్స్ కు, సిట్ కు బీజేపీ భయపడదన్నారు. నీ పార్టీలో 90 శాతం మంది ఇతర పార్టీ నుండి వచ్చిన వారేనని,నైతిక విలువల గురించి, పార్టీ ఫిరాయింపుల గురించి గొప్పగా మాట్లాడుతున్నారన్నారు. భద్రాచలం, రామప్పకు నిధులు తీసుకొచ్చానని, రాష్ట్రం ఇచ్చిన కేంద్రం ఇచ్చిన అవి ప్రజల డబ్బులన్నారు. రామప్ప అభివృద్ధికు 70 కోట్లు … దీంట్లో 60 కోట్లు ఖర్చు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కే ఇస్తామన్నారు. వందే భారత్ ట్రైన్ తెలంగాణ కు త్వరలోనే వస్తుంది… ట్రాక్ ను అప్ గ్రేడ్ చేస్తున్నామని, హైదరాబాద్ నుండి విజయవాడ వరకు నడపాలని నిర్ణయించడం జరిగిందన్నారు.