Kishan Reddy : ఆర్టికల్ 370 పునరుద్ధరణ చేసే అవకాశమే లేదు
- కాశ్మీర్లో 100 శాతం టార్గెట్ చేరుకున్నాం
- హర్యానాలో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని ప్రతిపక్షాలు అంటున్నాయి
- మరి జమ్మూకాశ్మీర్.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని ఎందుకు అనడం లేదు?
- ఆర్టికల్ 370 పునరుద్ధరణ చేసే అవకాశమే లేదు : కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాశ్మీర్ లో వంద శాతం టార్గెట్ రిచ్ అయ్యామని, హర్యానాలో EVM టాంపరింగ్ జరిగితే జమ్మూలో ఎందుకు జరగలేదు? కాంగ్రెస్ గెలిచిన రాష్ట్రాల్లో EVM టాంపరింగ్ ఎందుకు జరగలేదన్నారు కేంద్ర మంత్రి, జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఇంచార్జ్ కిషన్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జమ్మూలో ఒక రకంగా ఓటర్ల పోలరైజ్.. కాశ్మీర్ లో మరోరకంగా పోలారైజ్ జరిగిందని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. ప్రశాంతంగా అత్యధిక పోలింగ్ జరిగిన ఎన్నికల ఇవి అని, హర్యానా ఎగ్జిట్ పోల్స్ రాగానే మంత్రి వర్గ కూర్పు పై రాహుల్, సోనియా దగ్గర క్యూ కట్టారని ఆయన అన్నారు. ఆర్టికల్ 370 పునరుద్ధరణ చేసే అవకాశమే లేదని కిషన్ రెడ్డి ఉద్ఘాటించారు. ఆర్టికల్ 370 పై కాంగ్రెస్ మాట్లాడే ధైర్యం చేయడం లేదని, జమ్మూ కాశ్మీర్లో ఆరుగురు కాంగ్రెస్ నుంచి గెలిస్తే ఆ ఆరు మంది ముస్లింలే అని కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీ నుంచి గెలిచిన 29 మంది హిందువులే అని 19 మంది కొత్తవాళ్ళు అని ఆయన అన్నారు. భద్రత విషయంలో కేంద్రప్రభుత్వ విధానంలో మార్పు లేదు జమ్మూలో టెర్రరిజంపై మరింత జాగ్రత్తగా ఉంటామని కిషన్ రెడ్డి అన్నారు.
Russia-Iran: రష్యా- ఇరాన్ అధ్యక్షుల భేటీ..! ఉత్కంఠ రేపుతున్న సమావేశం!
Also Read
- Bhatti Vikramarka: సింగరేణి 128 మంది ఉద్యోగుల భవితవ్యంపై నిర్ణయం.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన.!
- Gold and Silver Price Today: మరింత తగ్గిన బంగారం ధరలు.. నేటి గోల్డ్, సిల్వర్ రేట్లు ఇవే
- Srisailam Temple: శ్రీశైలం మల్లన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు
- TDP Leadership Conclave: ఎమ్మెల్యేలకు చంద్రబాబు టాస్క్.. స్థానిక ఎన్నికల్లో గెలవాల్సిందే.. లేదంటే పని చేయనట్టే..!
ఇకపోతే.. మూసీ పరీవాహక ప్రాంతాల్లో ఆందోళనపై కిషన్ రెడ్డి స్పందిస్తూ.. ఇళ్ళను కూల గొట్టడం అంతా ఈజీ కాదని, అంత ధైర్యం లేదన్నారు. 30, 40 ఏళ్ల క్రితం నుండి వాళ్ళు ఇల్లు కట్టుకొని ఉంటున్నారన్నారు. స్వచ్ఛందంగా వెళ్లి పోతమంటే మాకేమీ అభ్యంతరం లేదని, డ్రైనేజ్ వ్యవస్థపై దృష్టి పెట్టకుండా మూసీ సుందరీకరణ ఎలా సాధ్యమన్నారు. ముందు ఇల్లు కూల్చుతా తర్వాత ప్లాన్ చేస్తా అంటే ఎలా అని ఆయన ప్రశ్నించారు. రేపు ప్రాజెక్ట్ ఆగిపోతే… బాధితుడు ఎక్కడకు పోవాలని, తొందరపాటు, దుందుడుకుతో పోతే సక్సెస్ కారని ఆయన వ్యాఖ్యానించారు. దీని వెనుక రేవంత్ రెడ్డికి వేరే ఉద్దేశ్యం ఉందని, రేవంత్ రెడ్డి ప్రజల వద్దకు వస్తా అంటే నేను కూడా ప్రజల పక్షాన వచ్చి మాట్లాడతా అని ఆయన అన్నారు.
Stock market: మళ్లీ ఒడిదుడుకులు.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్
మా ఎంపీ ఎవరైనా పేద వాళ్ళ ఇల్లు కూల్చమని చెప్పారా అని, నేనే చెప్పేదే మా పార్టీ పాలసీ అన్నారు. ఇంతకు ముందు కూడా అక్రమ నిర్మాణాలను ప్రభుత్వాలు కూల్చాయని, హైడ్రా అనేది రేవంత్ రెడ్డి పెట్టుకున్న పేరు… అదేమీ బూతం కాదు కదా అన్నారు. ఎంజీబీఎస్, మెట్రో పిల్లర్లను కూల్చండి ముందు… పేదల ఇల్లే కనిపిస్తున్నాయా, బీఆర్ఎస్ సంబంధించి ఎవరు ఇప్పటి వరకు మాతో మాట్లాడలేదు, బీఆర్ఎస్తో కాంప్రమైజ్ అయ్యే పరిస్థితే లేదు అని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Shaque: అనుమానాలతో పిచ్చెక్కించడానికి వస్తున్న పరిణీతి చోప్రా మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
Best Scooters for Women: మహిళలకు బెస్ట్ స్కూటర్లు ఇవే.. స్టైలిష్ లుక్, మంచి మైలేజ్‌తో అదిరిపోయే మోడల్స్!
-
Bhatti Vikramarka: సింగరేణి 128 మంది ఉద్యోగుల భవితవ్యంపై నిర్ణయం.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన.!
-
JrNTR : ఆదర్శకుటుంబానికి తోడుగా యంగ్ టైగర్ ఎన్టీఆర్
-
Asia Cup 2026: జిత్తులమారి వస్తున్నాడు.. టీమిండియాకు మరోసారి ట్రోఫీ వివాదం తప్పదా?
ట్రెండింగ్
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!
-
990 గ్రా.లకే ThinkBook..! మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్‌తో Lenovo IdeaPad Vibe సిరీస్ వచ్చేసింది.!
-
JIO: అదిరిపోయే ఆఫర్.. 5TB క్లౌడ్ స్టోరేజ్, 18 నెలల AI సబ్స్క్రిప్షన్, 2.5GB డైలీ డేటాతో ఏడాదిపాటు..!