Asia Cup 2026: జిత్తులమారి వస్తున్నాడు.. టీమిండియాకు మరోసారి ట్రోఫీ వివాదం తప్పదా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mohsin Naqvi To Attend Women’s Asia Cup 2026 Final: మహిళల ఆసియా కప్ 2026లో మరోసారి ట్రోఫీ అందజేత అంశం వివాదానికి దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) చైర్మన్, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చీఫ్ మోహ్సిన్ నఖ్వీ సెప్టెంబర్ 13న జరగనున్న మహిళల ఆసియా కప్ ఫైనల్‌కు హాజరుకానున్నట్లు సమాచారం. ముగింపు వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై విజేత జట్టుకు ట్రోఫీ అందజేయనున్నట్లు తెలుస్తోంది.
మహిళల ఆసియా కప్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు ఇప్పటికే సెమీఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. టోర్నీలో అత్యంత బలమైన జట్లలో ఒకటిగా ఉన్న టీమిండియా ఫైనల్ చేరి టైటిల్ గెలిస్తే.. ట్రోఫీని మోహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా స్వీకరిస్తారా? అనే ప్రశ్న ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇటీవల భారత్, పాకిస్థాన్ మహిళల మధ్య జరిగిన మ్యాచ్‌లోనూ ప్లేయర్స్ హ్యాండ్షేక్లు ఇచ్చుకోలేదు. భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, పాకిస్థాన్ కెప్టెన్ సనా మీర్ పరస్పరం హ్యాండ్‌షేక్ ఇచ్చుకోకపోవడంతో చర్చనీయాంశమైంది. దీంతో ఫైనల్లో ట్రోఫీ ప్రదానం సందర్భంగా కూడా ఇదే తరహా పరిస్థితి ఏర్పడనుంది.
Also Read
- Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వయసులోనే పతకాలు.. ప్రధాని మోడీ వ్యాఖ్యలకు వైభవ్ రియాక్షన్ వైరల్!
- IND vs WI 4th T20: ఎన్నో మ్యాచ్‌లను గెలిపించాడు.. అతడు జట్టులో ఉండుంటే టీమిండియా గెలిచేది!
- Punam Raut: టీమిండియాకు షాక్.. జింబాబ్వే సిరీస్‌కు ఒక్క రోజు ముందు స్టార్ బ్యాట్స్‌మెన్ రిటైర్మెంట్ ప్రకటన..
- Jasprit Bumrah: బుమ్రా లాంటి బౌలర్ మళ్లీ దొరకడు.. ప్రత్యామ్నాయం లేదు.. కానీ..!
2025 పురుషుల ఆసియా కప్ ఫైనల్ అనంతరం ట్రోఫీ అందించే విషయంలో తీవ్ర వివాదం చోటుచేసుకుంది. పాకిస్థాన్‌ను ఓడించి టైటిల్ గెలిచిన టీమిండియాకు ట్రోఫీని అందజేయడానికి మోహ్సిన్ నఖ్వీ పోడియం వద్ద వేచి ఉన్నాడు. అయితే అప్పటి భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సహా భారత ఆటగాళ్లు నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని స్వీకరించేందుకు నిరాకరించారు. ఈ పరిణామంతో అసంతృప్తికి గురైన నఖ్వీ వేడుకను మధ్యలోనే వదిలి ట్రోఫీని స్టేడియం నుంచి తీసుకెళ్లాడు. అనంతరం ఆ ట్రోఫీని దుబాయ్‌లోని ఏసీసీ కార్యాలయంలో ఉంచాడు. ఇప్పటివరకు అది భారత జట్టుకు అందలేదు.
ఈ వ్యవహారంపై బీసీసీఐ, ఏసీసీ మధ్య పలు దఫాలుగా చర్చలు జరిగినప్పటికీ సమస్య పూర్తిగా పరిష్కారం కాలేదు. దీంతో మహిళల ఆసియా కప్ ఫైనల్‌కు జిత్తులమారి మోహ్సిన్ నఖ్వీ హాజరు కావడం మరోసారి ఆసక్తిని పెంచుతోంది. భారత మహిళల జట్టు ఫైనల్‌కు చేరుకుని టైటిల్‌ను గెలుచుకుంటే ట్రోఫీ అందజేత సమయంలో ఏం జరుగుతుందనే దానిపైనే ఇప్పుడు అందరి దృష్టి ఉంది. గతంలో పురుషుల ఆసియా కప్‌లో జరిగిన ఘటన పునరావృతం కాకుండా నిర్వాహకులు ముందుగానే ఏర్పాట్లు చేస్తారా?.. లేదా మళ్లీ ట్రోఫీ విషయంలో ప్రతిష్టంభన ఏర్పడుతుందా? అన్నది చూడాలి.
తాజావార్తలు
-
South Indian Heros: బాలీవుడ్ దర్శకులకు నో.. సౌత్ మేకర్స్‌కే జై.!
-
Reliance: “కాంపిటీషన్‌కు మేము భయపడం.. రండి చూసుకుందాం..”.. మస్క్‌కు జియో స్ట్రాంగ్ కౌంటర్..
-
Anupama Parameswaran: కేవలం డబ్బుల కోసమే సినిమాలు చేయను.. నా లక్ష్యం అదే!
-
Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వయసులోనే పతకాలు.. ప్రధాని మోడీ వ్యాఖ్యలకు వైభవ్ రియాక్షన్ వైరల్!
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
ట్రెండింగ్
-
డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!