Shaque: నమ్మక ద్రోహాలతో పిచ్చెక్కించడానికి వస్తున్న పరిణీతి చోప్రా మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shaque: బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. సినిమాలతో అలరిస్తున్న ఈ బ్యూటీ ఇప్పుడు వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అది కూడా మామూలు కథతో కాదు.. మిస్టరీ, సస్పెన్స్, క్రైమ్ ఎలిమెంట్స్ తో నడిచే థ్రిల్లర్‌తో. ఇన్నాళ్లు టైటిల్ లేకుండా వార్తల్లో ఉన్న ఈ సిరీస్‌కు ఇప్పుడు ‘షాక్: ట్రస్ట్ నో వన్’ (Shaque: Trust No One) అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు మేకర్స్. అంతేకాదు.. ఎప్పుడు, ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో కూడా నెట్‌ఫ్లిక్స్ ఆఫీషియల్ గా వెల్లడించింది. పరిణీతి చోప్రా డిజిటల్ రంగంలోకి అడుగుపెడుతూ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ డెబ్యూ మిస్టరీ థ్రిల్లర్ సిరీస్ ‘షాక్: ట్రస్ట్ నో వన్’ ప్రపంచవ్యాప్తంగా నెట్‌ఫ్లిక్స్ (Netflix) వేదికగా 2026 సెప్టెంబర్ 24 నుండి స్ట్రీమింగ్ కాబోతోంది. ‘హిచ్కీ’ ఫేమ్ సిద్ధార్థ్ పి. మల్హోత్రా క్రియేటర్‌గా వ్యవహరించిన ఈ ప్రతిష్టాత్మక సిరీస్‌కు ప్రముఖ దర్శకుడు రెన్సిల్ డిసిల్వా (Rensil D’Silva) దర్శకత్వం వహించగా, పరిణీతితో పాటు జెనిఫర్ వింగెట్, తాహిర్ రాజ్ భాసిన్, సోని రజ్దాన్ మరియు సుమీత్ వ్యాస్ వంటి భారీ తారాగణం ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
కథ విషయానికి వస్తే.. ఈ సిరీస్ స్టోరీ కూడా ఎవరిని నమ్మాలి, ఎవరిని అనుమానించాలి అనే ప్రశ్నల చుట్టూనే తిరిగేలా కనిపిస్తోంది. తప్పిపోయిన తన ఐదేళ్ల చిన్నారి కోసం తొమ్మిదేళ్లుగా అలుపెరగకుండా అన్వేషిస్తున్న ఒక కన్నతల్లి (పరిణీతి చోప్రా) చుట్టూ కథ తిరుగుతుంది. ఆ పాప గురించిన కొన్ని నిజాలు బయటకు వస్తున్న తరుణంలో, ఆమె తన చుట్టూ ఉన్న ఆప్తులను, సొంత బంధువులను కూడా నమ్మలేని ఒక భయంకరమైన నమ్మకద్రోహాల వలయంలో చిక్కుకుంటుంది.
బిడ్డ కోసం ఆమె వెతుకుతున్న కొద్దీ కొత్త విషయాలు బయటపడతాయి. చివరికి తాను చూస్తున్నది నిజమేనా? తన చుట్టూ ఉన్న వారిలో ఎవరిని నమ్మాలి? అనే అనుమానాలు మొదలవుతాయి. ఈ క్రమంలో కథ ఊహించని మలుపులతో సస్పెన్స్‌గా మారనుంది. చివరికి ఈ కథ ఎలాంటి మలుపులు తిరుగుతుంది? అసలు నిజం ఏంటి? ఎవరు మోసగాళ్ళు ? ఎవరు నమ్మదగిన వాళ్ళు తెలియాలంటే సెప్టెంబర్ 24 వరకు వెయిట్ చేయాల్సిందే. నెట్‌ఫ్లిక్స్ ఈ సిరీస్‌ను సైకలాజికల్ మిస్టరీ, క్రైమ్ థ్రిల్లర్‌గానే ఆడియన్స్ ముందుకు తీసుకొస్తోంది. ఇక ఓటీటీ లవర్స్ కి సరికొత్త థ్రిల్లర్ కంటెంట్ దొరికనట్టే కనిపిస్తోంది.
Also Read
- Sai Pallavi: డైరెక్టర్ ఇన్పుట్స్ కాదు.. సీతమ్మ ఆశీర్వాదమే ముఖ్యం
- Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’ టికెట్ రేట్ల పెంపునకు ఏపీలో గ్రీన్ సిగ్నల్..
- Keerthy Suresh: షూటింగ్లో నన్ను భయపెట్టారు.. తోటి నటులపై కీర్తి సురేష్ సంచలన కామెంట్స్!
- Sai Pallavi: ఖాకీ డ్రెస్సులో సాయి పల్లవి మాస్ లుక్.. ‘ఓం’ గ్లింప్స్‌తో నెట్టింట రచ్చ!
తాజావార్తలు
-
Chairmans Desk: రాజకీయంపై ఈతరం జుగుప్సకు కారణాలివేనా..? నేతలు ఎందుకింతగా దిగజారుతున్నారు..?
-
Air Pollution : కరీంనగర్లో రావణకాష్టంగా మారిన డంపింగ్ యార్డ్..
-
53 Trains Cancelled: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. రెండు రోజులు 53 రైళ్లు రద్దు.. పూర్తి జాబితా ఇదే..
-
Off The Record: తాండూరు కాంగ్రెస్‌లో రహస్య భేటీ.. ఎమ్మెల్యేపై సీనియర్ల గుర్రు!
-
Off The Record : విజయనగరం కూటమిలో రెబల్స్ చిచ్చు.. సీట్ల సర్దుబాటు బెడిసికొట్టిందా?
ట్రెండింగ్
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..