Koratala Shiva: భోళా దెబ్బకు ట్రెండింగ్‌లో కొరటాల!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగాస్టార్ నటించిన లేటెస్ట్ ఫిల్మ్ ‘భోళా శంకర్’ ఆగష్టు 11న రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై మెగాస్టార్ ప్రమోషన్స్‌తో అంచనాలు పెరిగిపోయాయి. అంచనాలని పెంచడంతో చిరు తన వంతు ప్రయత్నం చేసాడు కానీ టాక్ మాత్రం అంతంతమాత్రంగానే ఉంది. మొదటి రోజు మార్నింగ్ షోకే ఈ సినిమా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. కొందరు బాగుందని అంటుంటే… ఇంకొందరు బాగాలేదని అంటున్నారు. మెగా ఫ్యాన్స్ కూడా ఈ సినిమా విషయంలో కాస్త డిసప్పాయింట్ గానే ఉన్నారు, అంతేకాదు మెహర్ రమేష్‌ను ట్రోల్ చేస్తున్నారు. మెగాస్టార్ ని వాడుకోవడం తెలియదు అంటూ మెహర్ ని ట్రోల్ చేస్తున్నారు. ఇదే సమయంలో కొరటాల శివ ట్రెండింగ్‌లోకి వచ్చేశాడు. కొరటాల ఫ్యాన్స్ కొందరు ‘ఆచార్య’ సినిమా గురించి ప్రస్తావిస్తూ… ఈ సమయంలో కొరటాల రియాక్షన్ ఇదే అంటూ ఫన్నీ మీమ్స్ క్రియేట్ చేస్తు, ఆయన కాలర్ ఎగరెస్తున్న ఓ వీడియోని వైరల్ చేస్తున్నారు.
గతంలో చిరు, చరణ్‌తో కొరటాల శివ చేసిన ‘ఆచార్య’ సినిమా ఫ్లాప్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. అప్పుడు కొరటాలపై కొందరు మెగా ఫ్యాన్స్ ఇదే తరహాలో ట్రోలింగ్, విమర్శలు చేసారు. ఇక ఇప్పుడు మెహర్ రమేష్ వంతు అన్నట్టు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. పైగా ఈ సినిమా ప్రమోషన్స్‌లో మెహర్ రమేష్ ఇచ్చిన ఎలివేషన్ వేరే లెవల్లో ఉండడంతో.. ఆ వీడియోలను కూడా ఎడిట్ చేసి ట్రోల్ చేస్తున్నారు. ఇక రామ్ గోపాల్ వర్మ అయితే… ‘జబర్, హైపర్ లాంటి ఆస్థాన విదూషకులు భజన పొగడ్తలకి అలవాటు పడిపోయి, రియాల్టీకి మెగా దూరమవుతున్నారని అనిపిస్తోందని’ ట్వీట్ చేశారు. మొత్తంగా భోళా శంకర్ దెబ్బకు… కొరటాల ట్రెడింగ్‌లోకి వచ్చేశాడు. ప్రస్తుతం ఎన్టీఆర్‌తో ‘దేవర’ సినిమా తెరకెక్కిస్తున్నాడు కొరటాల. మరి ఈ సినిమాతో కొరటాల బౌన్స్ బ్యాక్ అవుతాడేమో చూడాలి.
Also Read
- Romanchakam Trailer: సందీప్ రెడ్డి వంగా ప్రెజెంట్స్.. ‘రోమాంచకం’ ట్రైలర్లో ఏదో గట్టిగానే ఉంది!
- Tollywood Debut: బిగ్ బాస్ బ్యూటీకి బిగ్ ఛాన్స్.. హీరోయిన్గా టాలీవుడ్లోకి ఎంట్రీ!
- Renukaswamy Case: రేణుకాస్వామి మర్డర్ కేసులో దర్శన్‌కు భారీ ఎదురుదెబ్బ..
- Yash, NTR , Nani Films: యశ్, ఎన్టీఆర్, నాని.. ముగ్గురి సినిమాల్లో కామన్ పాయింట్ ఇదేనా! ‘టాక్సిక్’, ‘డ్రాగన్’, ‘ది ప్యారడైజ్’పై ఆసక్తికర చర్చ..
తాజావార్తలు
-
OTR: తెలంగాణలో భారీ ఎత్తున డబుల్ శాలరీ స్కామ్
-
OTR: మెదక్ జిల్లా కాంగ్రెస్ లో మళ్లీ బయటపడ్డ విబేధాలు
-
Operation Sindoor: పాకిస్తాన్ వేడుకున్నా దాడి చేశాం: మాజీ సీడీఎస్ అనిల్ చౌహాన్..
-
Homemade Rose Water: లేడీస్ స్పెషల్.. పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే రోజ్ వాటర్! గ్లోయింగ్ స్కిన్‌కు సింపుల్ సీక్రెట్ ఇదే..
-
Operation Sindoor: పాక్ అణుకేంద్రం ‘‘కిరాణా హిల్స్’’పై దాడి.. సంచలన నిజం చెప్పిన మాజీ CDS..
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్‌ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!