Kishan Reddy : ఈ శిలాఫలకాలు భవిష్యత్ తరాలకు ఓ స్ఫూర్తి…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘మేరీ మాటీ.. మేరా దేశ్’ కార్యక్రమంలో భాగంగా గోషామహల్ నియోజకవర్గంలో ఇంటింట తిరిగి మట్టి సేకరించారు కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు డా.లక్ష్మణ్‌తో బీజేపీ నాయకులు పాల్గొన్నారు. గోషామహల్ ట్రాఫిక్ (ACP) కార్యాలయం సమీపంలోని దుర్గామాత ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి.. మొక్కలు నాటారు అనంతరం దేశంకోసం జీవితాల్ని త్యాగం చేసిన మహనీయులను గుర్తు చేస్తూ వారి నుంచి స్ఫూర్తి పొందుతూ స్థానికులతో ప్రతిజ్ఞ చేయించారు.
అనంతరం అక్కడినుంచి.. ఇంటింటికీ తిరుగుతూ మట్టిని సేకరిస్తూ గోషామహల్ లోని ప్రముఖ స్వతంత్ర సమర యోధుడు వందేమాతరం రామచందర్ రావు నివాసం వరకు ఈ మట్టి సేకరణ కార్యక్రమం కొనసాగింది. వందేమాతరం రామచందర్ రావు నివాసం దగ్గర వారు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని వారి కుటుంబసభ్యుల్ని సన్మానించారు. రామచందర్ రావు త్యాగాన్ని వారి స్ఫూర్తిని పోరాటాన్ని వారి సేవల్ని కిషన్ రెడ్డి గుర్తుచేసుకున్నారు. ఈ సందర్బంగా కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ.. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా.. మనం గతేడాది, ఈ ఏడాది ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమాన్ని మీ అందరి భాగస్వామ్యంతో విజయవంతంగా నిర్వహించుకున్నామన్నారు.
Also Read
- India Retail Inflation Rises: సామాన్యులకు ధరల సెగ.. సెప్టెంబర్‌లో పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం..
- Hyderabadi Dalcha Recipe: అన్నంలోకి అదిరిపోయే సైడ్ డిష్.. ఇంట్లోనే అసలైన హైదరాబాదీ దాల్చా..
- Srisailam Reservoir: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో శ్రీశైలం జలాశయం.. దేశంలోనే తొలి ప్రాజెక్టుగా గుర్తింపు
- AP Mayor Reservations: ఏపీ మేయర్ రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే
కులామతాలతో సంభంధం లేకుండా దేశ సమగ్రతను చాటుతూ యావత్ దేశం జరుపుకుందని, దీంట్లో భాగంగానే.. ఈసారి ‘మేరీ మాటీ మేరా దేశ్’ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నామన్నారు. మనం పుట్టిన నేల.. మనల్ని కన్న దేశం పట్ల గౌరవభావాన్ని చాటుకోవడంతోపాటుగా.. ఈ మట్టి మీద పుట్టి (మన ప్రాంతంలో జన్మించి).. నాడు దేశ స్వాతంత్ర్యం కోసం, తర్వాత రజాకార్లతో పోరాటంలో, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశ సరిహద్దులు కాపాడంటలో అమరులైన సైనికులు వారి కుటుంబాలను, శాంతిభద్రతల పరిరక్షణలో ప్రాణత్యాగాలు చేసిన వివిధ సాయుధ బలగాలకు చెందిన వారిని, వారి కుటుంబాలను గుర్తుచేసుకుని వారి త్యాగాలను స్మరించుకుని మన మట్టి గొప్పదనాన్ని చాటుకోవడం ఈ కార్యక్రమం ముఖ్యోద్దేశం భవిష్యత్ తరాలకు చాటి చెప్పేదే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని ఆయన అన్నారు. ఇందులో భాగంగా ఇలా ఇంటింటికీ తిరిగి మట్టిని సేకరించి.. దీన్ని మన సమీపంలోని ఒక పార్కులో గానీ, చెరువు వద్ద గానీ.. ఒక చోట చేర్చి ఈ మట్టితో మొక్కలు నాటుకోవడం.. మన ప్రాంతంలో పుట్టి దేశ సేవలో అమరులైన వారిని స్మరించుకునేలా శిలాఫలకాలను ఏర్పాటుచేసుకోవాలి. ఈ శిలాఫలకాలు భవిష్యత్ తరాలకు ఓ స్ఫూర్తి… ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ.. ఐదు ప్రతిజ్ఞలు చేయాలి. అని ఆయన అన్నారు.
ఆ ఐదు ప్రతిజ్ఞలు..
1. అభివృద్ధి చెందిన భారత నిర్మాణంలో నావంతు పాత్రను సమర్థవంతంగా పోషిస్తాను.
2. వలసవాద ఆలోచనలనుంచి విముక్తి
3. ఘనమైన భారతదేశ సంస్కృతి, వారసత్వాలను ప్రోత్సహిస్తాను, ప్రచారం చేస్తాను.
4. దేశ ఐకమత్యం, సార్వభౌమత్వం కోసం నిరంతర కృషి చేస్తాను.
5. దేశ రక్షణకోసం, దేశాభివృద్ధికోసం త్యాగాలు చేసిన వారందరినీ గుర్తుచేసుకుని, గౌరవించడం బాధ్యతగా స్వీకరిస్తాను.
అని ప్రతిజ్ఞ చేయాలి.
ఈ శిలాఫలకాల వద్ద సెల్ఫీలు తీసుకుని..మేరీ మాటీ మేరాదేశ్ వెబ్‌సైట్‌లో పోస్టు చేయాలి.. మన పెద్దల ధైర్య సాహసాలను, శౌర్య ప్రతాపాలను, త్యాగాన్ని, మన దేశపు పవిత్రమైన మట్టి గొప్పదనాన్ని స్మరించుకుంటూ ఈ ‘మేరీ మాటీ మేరా దేశ్’ కార్యక్రమం జరుపుకుంటున్నాం. ఈ మట్టి ని సేకరించి డిల్లీ వేదికగా 75 వేల మొక్కలు నాటి మహనీయుల త్యాగల్ని స్మరించుకునేలా వారి నుంచి స్ఫూర్తి పొందెందుకు అమృత వనం డిల్లీ లో ఏర్పాటు చేయబోతున్నాం అని తెలిపారు. ఇది భవిష్యత్ తరాలకు స్పూర్తి నిస్తుందని ప్రధాని ఆలోచన మేరకుఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనీ కోరారు ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమం లో భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. మన దేశ స్వాతంత్ర్య పోరాట ఘట్టాలను మొదలుకుని.. నేటి అభివృద్ధి పథంలో ప్రయాణం వరకు ప్రతి అంశాన్నీ దేశ ప్రజలకు గుర్తుచేయడం ఈ కార్యక్రమం ఉద్దేశం. మీరందరూ ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొని.. కార్యక్రమ స్ఫూర్తిని కొనసాగించాలని కోరుతున్నాను.’ అని కిషన్ రెడ్డి తెలిపారు.
తాజావార్తలు
-
India Retail Inflation Rises: సామాన్యులకు ధరల సెగ.. సెప్టెంబర్‌లో పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం..
-
CM Revanth Reddy : దేశంలో మరో స్వతంత్ర పోరాటం తప్పదు
-
Pakistan Army Plane Crash: పాకిస్థాన్‌లో కూలిన ఆర్మీ శిక్షణ విమానం.. ఇద్దరు పైలట్లు మృతి
-
Hyderabadi Dalcha Recipe: అన్నంలోకి అదిరిపోయే సైడ్ డిష్.. ఇంట్లోనే అసలైన హైదరాబాదీ దాల్చా..
-
Coolpad Wide-Screen: రూ.13 వేలకే Coolpad వైడ్‌స్క్రీన్ ఫోన్? 16:10 డిస్ప్లే, Helio G99 చిప్సెట్తో రానుందా?
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!