NTR: మే 20న… ‘వస్తున్నాడు’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆర్ ఆర్ ఆర్ సినిమా రిలీజ్ అయ్యి ఏడాది దాటింది, ఇంకో ఏడాది వరకూ ఎన్టీఆర్ సినిమా థియేటర్ లో కనిపించదు. 2024 ఏప్రిల్ కి కొరటాల శివ, ఎన్టీఆర్ ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘ఎన్టీఆర్ 30’ సినిమా రిలీజ్ కి షెడ్యూల్ అయి ఉంది. ఈ గ్యాప్ లో 2023 మే 20కి ఎన్టీఆర్ ‘వస్తున్నాడు’. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని ఈ జనరేషన్ చూసిన బిగ్గెస్ట్ మాస్ హీరోగా మార్చిన సినిమా ‘సింహాద్రి’. 19 ఏళ్లకే బాక్సాఫీస్ ని షేక్ చేసిన ఎన్టీఆర్, ఇండియన్ సినిమా గర్వించేలా చేస్తున్న రాజమౌళిల కాంబినేషన్ లో వచ్చిన రెండో సినిమా ‘సింహాద్రి’. నందమూరి అభిమానులందరికీ మోస్ట్ ఫేవరేట్ సినిమా అయిన ఈ ఆల్ టైం బ్లాక్ బస్టర్ హిట్, మే 20న రీరిలీజ్ అవ్వడానికి రెడీ అయ్యింది. ఈమధ్య రీరిలీజ్ అనేది మాములు విషయం అయిపొయింది కానీ సింహాద్రిని మాత్రం అలా కాకుండా వరల్డ్ వైడ్ రీరిలీజ్ చేసి కొత్త సినిమా రేంజులో హంగామా చెయ్యడానికి ఫాన్స్ రెడీ అయ్యారు.
రీరిలీజ్ ట్రెండ్ ని స్టార్ట్ చేసిందే ఎన్టీఆర్ ఫాన్స్, ఆ ట్రెండ్ ని ఎండ్ కార్డ్ వేసే రేంజులో సింహాద్రి మాస్ హిస్టీరియాని చూపిస్తాం అంటూ ఫాన్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్, ట్రైలర్, ఫ్లైట్ బ్యానర్ లని కూడా ప్రమోషన్స్ కోసం వాడేస్తూ గత రెండు రోజులుగా సింహాద్రి రీరిలీజ్ కి ట్రెండ్ చేస్తూనే ఉన్నారు. 191 కేంద్రాల్లో 50 రోజులు, 154 కేంద్రాల్లో 100 రోజులు, 55 కేంద్రాల్లో ఈ సినిమా 175 రోజులు… ఇవి సింహాద్రి క్రియేట్ చేసిన రికార్డ్స్. 2003 జూలై 9న విజయ మారుతి క్రియేషన్స్ బ్యానర్ పై వి.దొరస్వామి రాజు నిర్మించిన సింహాద్రి సినిమా రిలీజ్ అయ్యింది. సింహాద్రి టైటిల్ సాంగ్ కి, రాజమౌళి టేకింగ్ కి, ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజెన్స్ కి, డైలాగ్ డెలివరీకి, హై ఆక్టేన్ యాక్షన్ ఎపిసోడ్స్ కి ఆడియన్స్ థియేటర్స్ లో రచ్చ చేశారు. మరోసారి ఇలాంటి రచ్చనే చెయ్యడానికి ఎన్టీఆర్ ఫాన్స్ రెడీ అవుతున్నారు. మరి సింహాద్రి రీరిలీజ్ కలెక్షన్స్ ఏ రేంజులో ఉంటాయో చూడాలి.
Also Read
- Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి 'రామోజీ గ్రూప్'.. 'తెల్ల కాగితం'తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
- Anakapalli Producer Naidu: టికెట్ ఇవ్వలేదని థియేటర్‌నే కొనేసిన నిర్మాత.. వాట్ ఎ జర్నీ!
- Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
- NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్‌డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
Fans of Man of Masses @tarak9999 announced the re-release of #Simhadri4K in style.
An indication of sky high celebrations in store on May 20th.#Simhadri4KonMay20 pic.twitter.com/6tos81QxYs
— Vamsi Kaka (@vamsikaka) April 9, 2023
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!