Kiran Abbavaram : యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా “క”. ఈ సినిమాలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్ గా నటించారు. శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి నిర్మించారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో ”క” సినిమాను తెరకెకెక్కించారు. ఈ సినిమా 31న దీపావళి పండుగ సందర్భంగా తెలుగులో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ అయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో “క” సినిమాను ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి రిలీజ్ చేశారు.
Read Also:TG Assembly Sessions: రేపు తెలంగాణ అసెంబ్లీ సమావేశం.. ప్రభుత్వ ఎజెండా రిలీజ్
ఇక మూవీ ‘క’ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. తన కెరీర్లో భారీ వసూళ్లను సాధించిన చిత్రంగా క నిలిచింది. ఈ సినిమాను పూర్తి సైకలాజికల్ థ్రిల్లర్‌గా మేకర్స్ తెరకెక్కించడంతో ఈ మూవీ ప్రేక్షకులను థ్రిల్ కు గురి చేసింది. ఇక ఈ సినిమాతో కిరణ్ అబ్బవరం ఎంతగానో ఎదురుచూసిన సక్సెస్ వచ్చింది. ప్రస్తుతం ‘క’ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం, ఇప్పుడు మళ్లీ తన జోరును పెంచేందుకు రెడీ అవుతున్నాడు. క మూవీ తర్వాత తన నుంచి రాబోతున్న లేటెస్ట్ చిత్రం “దిల్ రూబ”.
Read Also:Robbery : ఘరానా దొంగలు.. కొత్తగా నిర్మాణంలో ఉన్న గృహాలే టార్గెట్
దర్శకుడు విశ్వ కరుణ తెరకెక్కించిన ఈ చిత్రం నుంచి మేకర్స్ టీజర్ అప్డేట్ ఇచ్చేశారు. దీనితో ఈ టీజర్ కట్ ని మేకర్స్ జనవరి 3న రిలీజ్ కి తీసుకొస్తున్నట్లుగా అనౌన్స్ చేశారు. అలాగే ఈ చిత్రాన్ని ఈ రానున్న ఫిబ్రవరిలో రిలీజ్ కి తీసుకొస్తున్నట్లుగా కూడా కన్ఫర్మ్ చేశారు. ఈ డేట్ ఇంకా కన్ఫర్మ్ కావాల్సి ఉంది. ఇక ఈ చిత్రంకి “క” సినిమాకు సంగీతం అందించిన సామ్ సి ఎస్ బాణీలను అందించనున్నారు. యూడ్ లీ ఫిలిమ్స్ వారు నిర్మాణం వహిస్తుండగా ఈ సరిగమ వారి సమర్పణలో ఈ చిత్రం రాబోతుంది.