Pan India movie: ‘ఖుదీరామ్ బోస్’ బయోపిక్ టైటిల్ ను లాంచ్ చేసిన వెంకయ్య నాయుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జాగర్లమూడి పార్వతి సమర్పణలో గోల్డెన్ రెయిన్ ప్రొడక్షన్స్ పతాకంపై రాకేష్ జాగర్లమూడి, వివేక్ ఒబెరాయ్, అతుల్ కులకర్ణి, నాజర్, రవిబాబు, కాశీ విశ్వనాథ్ నటీ నటులుగా ప్రతిభావంతుడైన విద్యాసాగర్ రాజు దర్శకత్వంలో విజయ్ జాగర్లమూడి నిర్మిస్తున్న స్వాతంత్ర్య సమర యోధుడు బయోపిక్ “ఖుదీరామ్ బోస్”. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, బెంగాలీ, హిందీ భాషల్లో పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకొంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని త్వరలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్న సందర్బంగా ఈ సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ ను భారత మాజీ ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు చేతుల మీదుగా విడుదల చేసారు. ఈ సందర్బంగా చిత్ర యూనిట్ మాట్లాడుతూ, భారత స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్న అతి పిన్న వయస్కుడైన మొదటి స్వాతంత్ర్య సమర యోధుడు ఖుదీరామ్ బోస్,తను 1889లో జన్మించాడు.
Also Read
- TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
- Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
- Minister Rekha Arya Files FIR Against Husband: ఇతర మహిళలతో సంబంధాలు.. భర్తపై ఫిర్యాదు చేసిన మంత్రి.. అసలేం జరిగింది?
- YSRCP Candidates List: మేయర్, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. పూర్తి జాబితా ఇదే!

అయితే ప్రసిద్ధ ముజఫర్‌పూర్ కుట్ర కేసులో బ్రిటీష్ రాజ్ చేత దోషిగా నిర్ధారించబడి 1908లో మరణశిక్ష విధించబడ్డాడు. ఈ కేసు విషయంలో జరిగిన కుట్ర విషయం. చరిత్రను అనుసరించే విద్యార్థులకు బాగా తెలుసు. ఇందులో రాకేష్ జాగర్లమూడి తొలిసారిగా నటుడిగా పరిచయం అవుతున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో అత్యుత్తమ నటను కనబరచారు. సంగీత దర్శకుడు మణిశర్మ, పద్మశ్రీ తోట తరణి, సినిమాటోగ్రాఫర్ రసూల్ ఎల్లోర్, ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేష్, డైలాగ్ రైటర్ బాలాదిత్య… ఇలా ఈ చిత్రానికి పని చేసిన వారందరూ ఈ సినిమాకు చాలా డెడికేటెడ్ గా వర్క్ చేయడంతో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకోవడం జరిగింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి ప్రయత్నం చేస్తున్నాము అని అన్నారు.
తాజావార్తలు
-
TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
-
TG Safe Raids : ఈగలు, ఎలుకల మధ్య స్వీట్ల తయారీ.. 2,480 కిలోలు ధ్వంసం..
-
Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
-
OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్‌గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
-
OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!