Mallikarjun Kharge: గతంలో ఆమె తిరస్కరించారు..ప్రధాని అభ్యర్థిపై ఖర్గే సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. నేడు ఆరో దశ పోలింగ్ ముగిసింది. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. అధికారాన్ని చేజిక్కించుకునేందుకు ఇండియా కూటమి ప్రయత్నిస్తోంది. కాగా.. ఒక వేళ ఇండియా కూటమికి అధిక సీట్లు వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అందులో ప్రధాని అభ్యర్థి ఎవరనే దానిపై దేశ వ్యాప్తంగా చర్చ కొనసాగుతోంది. తాజాగా శనివారం సిమ్లాలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అక్కడ ఓ మీడియా సంస్థ “దేశంలో విపక్షాల కూటమి గెలిచిన తర్వాత ప్రధాని ఎవరు?” అనే ప్రశ్న సంధించింది. ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ.. “ఈ ప్రశ్న మీలో ఎవరు కోటీశ్వరుడు అవుతారు అన్నట్లుగా మారింది. సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుపైన తర్వాత విపక్ష నేతలంతా కలిసి నిర్ణయం తీసుకుంటాం. గతంలో కాంగ్రెస్ కు అత్యధిక సీట్లు ఉన్నప్పటికీ సోనియా గాంధీ ప్రధాన మంత్రి పదవి ప్రతిపాదనను తిరస్కరించారు. మన్మోహన్ సింగ్ ప్రధాని అయ్యారు. పదేళ్లపాటు యూపీఏ సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపాం.ఈ విషయాన్ని మర్చిపోయారా?” అని సమాధానమిచ్చారు.
READ MORE: Delhi fire: ఓ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. మంటలార్పుతున్న 26 ఫైరింజన్లు
Also Read
- Vizag: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. తొమ్మిదికి చేరిన మృతుల సంఖ్య.! దర్యాప్తులో సంచలన విషయాలు..
- Story Board : ప్రధాని మోడీ సక్సెస్ సీక్రెట్ ఏంటి? నెహ్రూ రికార్డు ఎలా బద్దలు కాబోతుంది?
- Narendra Modi: 'జవహర్ లాల్ నెహ్రూ'ను అధిగమించిన నరేంద్ర మోడీ.. అత్యధిక కాలం ప్రధానిగా.!
- Amit Shah : తెలంగాణలో పోటీ, పొత్తులపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు
అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ దేశాన్ని హిందువులు, ముస్లింల మధ్య విభజించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకం కాదని, ఆయన సిద్ధాంతాలకు వ్యతిరేకమన్నారు. ప్రధాని మోడీ దేశ ప్రజలకు అబద్ధాలు చెప్పారని, 2014లో రెండు కోట్ల ఉద్యోగాలు, నల్లధనం వెనక్కి రప్పించడం, ద్రవ్యోల్బణం తదితర హామీలను నెరవేర్చలేదన్నారు. హిమాచల్‌లో కూడా ప్రధాని మోడీ 2014, 2019లో భారీ వాగ్దానాలు చేశారన్నారు. గెలిచిన తర్వాత తిరిగి చూడలేదని ఆరోపించారు. హిమాచల్ విపత్తులో మునిగినప్పుడు సహాయం చేయలేదన్నారు. బీజేపీ రాష్ట్రంల్లోని ప్రభుత్వాలను పడగొట్టేందుకు యత్నిస్తోందని.. హిమాచల్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు చూస్తోందన్నారు. ధనబలం, గూండాయిజం, ఈడీ సీబీఐని ఉపయోగించి ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేసేందుకు బీజేపీ కృషి చేస్తోందని మల్లికార్జున్ ఖర్గే అన్నారు.
తాజావార్తలు
-
Blink Mobility EV: టాటా నానో కంటే చౌకైన EV కారు.. 250KM రేంజ్‌తో రానున్న బ్లింక్ మోడల్
-
Weather Update : తెలంగాణకు బ్రేక్ ఇచ్చిన రుతుపవనాలు.. మళ్లీ వానల జోరు ఎప్పుడంటే.?
-
PM Kisan 23వ విడత: ఖరీఫ్ సీజన్ వేళ రైతులకు కీలక అప్డేట్.. జూన్ 18న రూ.2,000 ఖాతాలో జమ అవుతాయా?
-
Vizag: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. తొమ్మిదికి చేరిన మృతుల సంఖ్య.! దర్యాప్తులో సంచలన విషయాలు..
-
Tilak Varma: అతడు క్రీజులో ఉన్నంత సేపు సుస్సు పడింది.. ఓటమి తప్పదనుకున్నా: తిలక్ వర్మ
ట్రెండింగ్
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి