Site icon NTV Telugu

Mallikarjun Kharge: విమాన ప్రమాదానికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి.. ఖర్గే డిమాండ్

Mallikarjun Kharge

Mallikarjun Kharge

అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే డిమాండ్ చేశారు. ఈ విషాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు, గాయపడిన వారికి సరైన పరిహారం అందించాలన్నారు. ఖర్గే అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిని సందర్శించి గాయపడిన వారిని పరామర్శించారు. ఈ దుఃఖ సమయంలో వారికి సంతాపం తెలిపారు. గాయపడిన వైద్య విద్యార్థులను, ప్రాణాలతో బయటపడిన ఏకైక వ్యక్తి విశ్వస్‌కుమార్ రమేష్‌ను కలిశారు.

READ MORE: AP DSC: ఈ నెల 20, 21 తేదీల్లో జరగాల్సిన డీఎస్సీ పరీక్షలు వాయిదా.. కారణం ఏంటంటే?

అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఖర్గే మాట్లాడారు.”ఈ విమాన ప్రమాదానికి ప్రభుత్వం బాధ్యత వహించాలి. బాధితుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలి. రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు అధికారికంగా పరిహారం ప్రకటించలేదు. అహ్మదాబాద్ నగరం ఈ భయంకరమైన ప్రమాదాన్ని ఎప్పటికీ మరచిపోదు. గాయపడిన వారు త్వరగా కోలుకునేలా వైద్యం అందించాలని వైద్యులను కోరాం. ఈ ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలతో మిగలడం అద్భుతం. వీలైనంత త్వరగా ఆయన ఆరోగ్యం మెరుగుపడాలని ప్రార్థిస్తున్నాం. మా పార్టీ కార్యకర్తలు రెండు రోజులుగా బాధితులకు సహాయం చేస్తున్నారు. భవిష్యత్తులో కూడా ఏవైన ఘటనలు జరిగితే ఇలాగే సాయం చేస్తారు. బాధితులకు మందులు లేదా మరేదైనా అవసరమైతే.. అవి స్థానికంగా అందుబాటులో లేకపోతే, మా పార్టీ కార్యకర్తలు దానిని ఏర్పాటు చేస్తారు. ఇలాంటి ఘటనలను తేలికగా తీసుకోకూడదు. గాయపడిన వారిని ఎవరూ కలిసి ఫోటోలు దిగి క్రెడిట్ తీసుకోవడానికి ప్రయత్నించవద్దు. ఈ సందర్భంలో దర్యాప్తుపై వ్యాఖ్యానించడం సముచితం కాదు. బ్లాక్ బాక్స్ కనుగొనబడింది. ముందు దర్యాప్తులోని అంశాలు తేలనివ్వండి. ఆ తర్వాత మేము దాని ఆధారంగా మా డిమాండ్లను ముందుకు తెస్తాం” అని ఆయన అన్నారు.

READ MORE: Prowatch Xtreme: లావా క్రేజీ డీల్.. రూ.16 కే స్మార్ట్‌వాచ్..

Exit mobile version