అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే డిమాండ్ చేశారు. ఈ విషాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు, గాయపడిన వారికి సరైన పరిహారం అందించాలన్నారు. ఖర్గే అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిని సందర్శించి గాయపడిన వారిని పరామర్శించారు.