ప్రముఖ దర్శకుడు అట్లీ తన ప్రతిభతో దక్షిణాది నుంచి బాలీవుడ్ వరకు తిరుగులేని గుర్తింపు సంపాదించుకున్నాడు. తాజాగా ఆయన జీవితంలో మరో గౌరవనీయ ఘట్టం చోటుచేసుకుంది. అట్లీకి చెన్నైలోని సత్యభామ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. ఈ సందర్భంగా సినీ పరిశ్రమలో అతని శుభకాక్షలు తెలియజేస్తోంది.
Also Read : Kajol : ఫోటోగ్రాఫర్లు.. మమల్ని అక్కడ కూడా వదలడంలేదు
2025 జూన్ 14న సత్యభామ విశ్వవిద్యాలయం 34వ కాన్వొకేషన్ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో దర్శకుడు అట్లీ కి ‘గౌరవ డాక్టరేట్’ బిరుదును అందజేశారు. విశ్వవిద్యాలయ ఛాన్సలర్ డాక్టర్ మారియజీనా జాన్సన్ చేతుల మీదుగా ఈ పురస్కారం అందుకున్నారు. ఈ వేడుకకు అట్లీ భార్య ప్రియ అట్లీ, ఆయన తల్లి తదితర కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఇక అట్లీకి ఈ గౌరవం లభించిందన్న విషయం తెలియగానే టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ సోషల్ మీడియాలో స్పందించారు.. తన ట్విట్టర్‌లో ‘గౌరవ డాక్టరేట్ అందుకున్న @Atlee_dir గారికి హృదయపూర్వక అభినందనలు. మీ అభిరుచి, నైపుణ్యం ఈ స్థాయిలో జరుపుకోవడం చూసి నిజంగా సంతోషంగా ఉంది. మీరు ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలు చేరుకోవాలి కోరుకుంటున్నాను’ అని ట్వీట్ చేశారు. దీంతో ఈ ట్వీట్ కొద్ది గంటల్లోనే వైరల్‌గా మారింది. అభిమానులు, ఇండస్ట్రీ వర్గాలు కూడా అట్లీకి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
Big congratulations to @Atlee_dir garu on receiving the honorary doctorate. Really happy to see your passion and craft being celebrated at this level. Wishing you many more heights ahead 🖤 pic.twitter.com/1vPsSd0LOu
— Allu Arjun (@alluarjun) June 14, 2025