Uttam Kumar Reddy : సీతారామ ప్రాజెక్ట్ మిగిలిన పనులపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు భేటీ అయ్యారు. సత్తుపల్లి ట్రంక్ పనులు జనవరి నాటికి పూర్తి చేయాలని ప్రతిపాదించారు. సీతమ్మ సాగర్ బ్యారేజి నిర్మాణం పూర్తి చేస్తే జల విద్యుత్ అందుబాటులోకి వస్తుందని నిర్మాణ పనులు వేగవంతం చేయాలని తుమ్మల నాగేశ్వర రావు కోరారు. ఈ సమావేశంలో సత్తుపల్లి ట్రంక్, సీతారామ ప్రాజెక్ట్…
ఖమ్మం నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో నగర మేయర్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు, గిడ్డంగుల సంస్థ చైర్మన్, కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. లాఠీ దెబ్బలకు భయపడకుండా కాంగ్రెస్ కోసం కార్యకర్తలు పనిచేశారు.. కార్యకర్తలు కూడా అధికారాన్ని అనుభవించాలని అన్నారు.
Tummala Nageswara Rao : ఖమ్మం జిల్లా ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవంలో మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ.. ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద ఉన్న భారం ఎవరీ మీద లేదన్నారు. చేసిన పనులకు బిల్లులు ఇవ్వండని ఆయన అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉండి కూడ ఒక్క ఎకరానికి నీళ్లు లేవన్నారు. ఖమ్మం జిల్లాలో 10 నియోజక వర్గాలకు గోదావరి జలాలు అందించాలనేది నా కోరిక అని, కరువు వచ్చినా కాటకాలు వచ్చినా ఖమ్మం 10 నియోజక…
Tummala Nageswara Rao : ఖానాపురం హవేలీ నాల్గవ డివిజన్‌లో 15వ ఆర్థిక సంఘం నిధులతో రూ. 1.43 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (జి+1 భవనం) పనులకు సోమవారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా, మంత్రి మాట్లాడుతూ, “ప్రభుత్వం నుండి వచ్చిన నిధులతో అన్ని ప్రాంతాల ప్రజల అవసరాలను తీర్చేందుకు అభివృద్ధి పనులు చేపడుతున్నాం. ఎటువంటి రాజకీయ వివక్ష లేకుండా ప్రజలకు సేవలందించేందుకు కట్టుబడి ఉన్నాం”…