అస్సాం జైలులో ఉన్న ఖలిస్తానీ వేర్పాటువాది అమృతపాల్ సింగ్ ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ‘వారిస్ పంజాబ్ దే’ సంస్థ చీఫ్ అమృతపాల్ సింగ్‌ను గతేడాది ఏప్రిల్‌లో అరెస్టు చేసి.. అతనిపై కఠినమైన జాతీయ భద్రతా చట్టం (ఎన్‌ఎస్‌ఏ) విధించారు. అమృతపాల్‌తో పాటు అతని తొమ్మిది మంది సహచరులు ప్రస్తుతం దిబ్రూగఢ్ జైలులో ఉన్నారు.
Read Also: CM Revanth Reddy: నేడు చేవెళ్లలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన..
కాగా, అమృతపాల్ సింగ్ లోక్‌సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా ఖాదూర్ సాహిబ్ స్థానం నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయని ఆయన తండ్రి తార్సేమ్ సింగ్ ఇవాళ (గురువారం) తన కుమారుడిని కలిసిన తర్వాతే ఈ విషయంపై వ్యాఖ్యానిస్తానని సింగ్ లాయర్ చెప్పారు. అయితే, అమృతపాల్ సింగ్ మొదట్లో రాజకీయాల్లో చేరేందుకు ఆసక్తి చూపలేదని ఆయన నొక్కి చెప్పారు. ఇక, న్యాయవాది రాజ్‌దేవ్ సింగ్ ఖల్సా బుధవారం నాడు దిబ్రూగఢ్ జైలులో అతడ్ని కలిశారు. ఈసారి పార్లమెంటు సభ్యునిగా ఖదూర్ సాహిబ్ నుంచి పోటీ చేయాలని అతడ్ని అభ్యర్థించినట్లు పేర్కొన్నారు.
Read Also: Ramasahayam Raghuram Reddy : ఖమ్మం ఎంపీ అభ్యర్ధిగా విక్టరీ వెంకటేష్ వియ్యంకుడు..
గత ఏడాది ఫిబ్రవరి 23వ తేదీన అమృతపాల్, అతని మద్దతుదారులు బారికేడ్లను బద్దలుకొట్టి అజ్నాలాలోని పోలీస్ స్టేషన్‌లోకి ప్రవేశించారు. ఆ సమయంలో సహచరురాలు లవ్‌ప్రీత్ సింగ్ విడుదల విషయంలో పోలీసులతో వాగ్వాదం జరిగింది. దీని తర్వాత పంజాబ్ పోలీసులు రంగంలోకి దిగి అమృతపాల్ సింగ్ తో పాటు అతని సహచరులపై చర్యలు తీసుకున్నారు. గత ఏడాది మార్చిలో జలంధర్ జిల్లాలో పోలీసుల నుంచి తప్పించుకున్నాడు.. చాలా రోజుల పాటు గాలించిన తర్వాత ఎట్టకేలకు 2023 ఏప్రిల్ 23వ తేదీన అమృతపాల్ సింగ్ ను పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు.