Khalistan: జాతీయ భద్రతా చట్టం (NSA) కింద అస్సాంలోని దిబ్రూఘర్ జిల్లాలోని జైలులో ఉన్న రాడికల్ సిక్కు మత బోధకుడు, ఖదూర్ సాహిబ్ పార్లమెంటు సభ్యుడు (MP) అమృతపాల్ సింగ్ పంజాబ్, హర్యానా హైకోర్టును ఆశ్రయించారు.
అస్సాం జైలు నుంచి పంజాబ్‌లోని ఖడూర్ సాహిబ్‌లో లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న రాడికల్ బోధకుడు అమృతపాల్ సింగ్ ప్రారంభ ట్రెండ్స్ లో ముందంజలో ఉన్నారు. ఉదయం 10.30 గంటలకు ఎన్నికల సంఘం గణాంకాల ప్రకారం, కాంగ్రెస్ అభ్యర్థి కుల్బీర్ సింగ్ జీరాపై స్వతంత్ర అభ్యర్థి అమృతపాల్ సింగ్ 45,424 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
ఖలిస్తాన్ మద్దతుదారు అమృత్‌పాల్ సింగ్ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. నామినేషన్ దాఖలు చేసేందుకు వీలుగా తాత్కాలికంగా విడుదల చేయాలని కోరుతూ ఇవాళ ( మే10) పంజాబ్-హర్యానా హైకోర్టును ఆశ్రయించాడు.
Amritpal Singh: వేర్పాటువాది, ‘వారిస్ పంజాబ్ దే’ చీఫ్ అమృత్‌పాల్ సింగ్ తల్లిని పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. తన కొడుకు జైలును మార్చాలని డిమాండ్ చేస్తూ ఆమె మార్చ్‌కి పిలుపునిచ్చింది.
ఖతిస్థానీ సానుభూతిపరుడు అమృతపాల్ సింగ్ కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. అయితే, అమృతపాల్ సింగ్ కు మద్దతు పలు పోస్టర్లు దర్శనమియడం కలకలం రేపింది. ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ జిల్లాలో వారిస్ పంజాబ్ డీ చీఫ్ అమృతపాల్ సింగ్‌కు మద్దతుగా పలు పోస్టర్లు వెలిశాయి.
పరారీలో ఉన్న ఖలిస్తాన్ అనుకూల మద్దతుదారుడు అమృత్‌పాల్ సింగ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో తిరుగుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
దుబాయి రాక ముందు ఒక సాధారణ భారతీయుడు అయిన అమృత్‌పాల్ సింగ్.. కనీసం స్వీయ మతాచారాలను కూడా పాటించని వ్యక్తి కరుడుగట్టిన మతోన్మాదిగా మారిపోయాడు. ఉపాధి కొరకు గల్ప్‌కు వచ్చిన ఒక సాదాసీదా గ్రామీణ యువకుడు సామాజిక మాధ్యమాల పుణ్యమా అంటూ ఏ విధంగా దేశభద్రతకు సవాల్ విసురుతున్నాడో పంజాబీ ప్రవాసుడు అమృతపాల్ సింగ్ ఉదంతాన్ని గమనిస్తే అర్థమవుతుంది.
Punjab: పంజాబ్ పోలీసులు, కేంద్రబలగాలు ఖలిస్తానీ వేర్పాటువాది, ‘వారిస్ పంజాబ్ దే’ చీఫ్ అమృత్ పాల్ సింగ్ కోసం జల్లెడ పడుతున్నాయి. గత రెండు రోజులుగా అతడి కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇప్పటికే ఆయన మద్దతుదారులు 78 మందిని లోపలేశారు. ఇదిలా ఉంటే కొంతమంది కెనడా, యూకే సిక్కు ఎంపీలు మాత్రం పంజాబ్ పరిస్థితిపై మొసలి కన్నీరు కారుస్తున్నారు. పంజాబ్ లో ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయంటూ కామెంట్స్ చేస్తున్నారు.